కడియం సమర్ధత ముందు సీఎం కేసీఆర్ బలాదూర్ : మంద కృష్ణ మాదిగ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా దళిత సాధికారత విషయంలో ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్న మందకృష్ణ మాదిగ దళితులను ఆయన పచ్చి మోసం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక తాజాగా దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని, ప్రభుత్వాన్ని వెంటాడతామని మందకృష్ణ మాదిగ వెల్లడించారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని సీఎం చేస్తానని ప్రకటించి మోసం చేశారని మండిపడ్డారు.దళిత ఎమ్మెల్యేలలో ఒక్కరిని మంత్రిని చేయాలని డిమాండ్ చేసిన మందకృష్ణ మాదిగ, కొప్పుల ఈశ్వర్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని పేర్కొన్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి సమర్ధత, నీతి, నిజాయితీ ముందు సీఎం కేసీఆర్ బలాదూర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు నోరులేని మూగజీవాలని, అందుకే వారు నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు మందకృష్ణ మాదిగ.

దళిత సాధికారత పేరుతో సమావేశాలు జరగడం తీర్మానాలు చేయడం తప్ప వాటిని అమలు చేసే చిత్తశుద్ధి సీఎం కేసీఆర్ కు లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి పై బహిరంగ హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్, దళిత సాధికారత గురించి మాట్లాడటం పచ్చి మోసమని ఆయన మండిపడ్డారు. ఇక తాజాగా రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన కత్తి మహేష్ మరణం పై సంచలన ఆరోపణలు చేసిన మంద కృష్ణ మాదిగ అంతకుముందు దళిత మహిళ మరియమ్మ కేసును ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు.
అధికార టీఆర్ఎస్ పై సైద్ధాంతిక పోరాటానికి దిగుతామని చెప్పిన మంద కృష్ణ మాదిగ సీఎం కేసీఆర్ దొర తెలంగాణాకు ప్రత్యామ్నాయంగా సామాజిక తెలంగాణ నిర్మిస్తామని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ యుద్ధభేరి నినాదంతో ప్రజాక్షేత్రంలో సైకిల్ యాత్ర లను, పాదయాత్రను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications