ఎంతో మంది సీఎంలు నాకు మోకరిల్లారు.!ఈయనెంత.?నేను శపిస్తే నాశనమేనంటూ కేఎ పాల్ సంచలనం.!
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుపై ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. కక్షపూరిత రాజకీయాలకు చంద్రశేఖర్ రావు తెర తీస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యవహారాలు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు పాల్.
హైదరాబాద్: అనుచిత వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ మరో సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రతీ సారీ అమెరికా నుంచి అమలాపురం నేతల వరకూ అందరిని ఏకి పడేసే కేఏ పాల్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ సెక్రెటేరియట్ ప్రారంభోత్సవాన్ని తప్పుబట్టిన పాల్ అందుకు అనుగుణంగా కోర్ట్ తలుపు కూడా తట్టిన సందర్బాలు లేకపోలేదు. అదే పరంపరలో తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుపైన సంచలన వ్యాఖ్యలు చేసారు ఈ దైవాంశ సంభూతుడు కేఏ పాల్.

మహామహా నేతలే మోకరిల్లారు..
దేశంలో ఏ రాజకీయ పరిణామం చోటుచేసుకున్నా దాని గురించి కేఏ పాల్ స్పందించకుండా ఉండరు. దేశంలో బీజేపి విధానలు, పరిపాలన, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, గత ప్రధాన మంత్రులు దేశాభివృద్దికి ఏం చేసారు, ఎలాంటి ప్రణాలికలు అమలు చసారు అనే అంశాలను గంటల కొద్ది వాదిస్తుంటారు పాల్. ప్రధానంగా దేశం ఎంత అప్పుల్లో కూరుకుపోయింది, యువతకు విద్యా, ఉపాది అవకాశాలను కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకూ విజయం సాధించాయి అనే అంశాలను కూడా చర్చిస్తుంటారు కేఏ పాల్. ఇదే క్రమంలో విలేఖరుల సమావేశం నిర్వహించి వావివరసలు లేకుండా విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు పాల్.

కేసీఆర్ కక్షపూరిత రాజకీయాలు..
ఆదే క్రమంలో ఎంతో మంది ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు తనతో సన్నిహితంగా ఉంటారని, రాజకీయంగా తన సలహాలను కూడా వారు తీసుకుంటారని కేఏ పాల్ వివరిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్ రావుకు ధైర్య సాహసాలు ఎక్కువని అందరూ అనుకుంటారని, కాని తన అంశంలో చంద్రశేఖర్ రావు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు కేఏ పాల్. తనపో కక్ష సాధించేందుకు మరుగున పడ్డ సంఘటనలు పునఃప్రారంభించేందుకు చంద్రశేఖర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని ఘాటు విమర్శలు చేస్తున్నారు పాల్.

కేసీఆర్ నరకానికి పోతాడు..
ప్రపంచంలోని మహామహా నేతలనే తన ముందు మోకరిల్లేలా చేశానని, తన ముందు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎంత? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రశేఖర్ రావు తనను అంతం చేస్తే తాను స్వర్గానికి వెళ్తానని అన్నారు. కానీ చేసిన అవినీతికి చంద్రశేఖర్ రావు మాత్రం నరకానికే వెళ్తారని కేఏ పాల్ అన్నారు. తాను ప్రార్థిస్తే చాలు చంద్రశేఖర్ రావు సర్వనాశనం అవుతారని సంచలన వ్యాఖలు చేసారు పాల్. దైవ దూతల మీద చేయి వేస్తే దేవుడు క్షమించడని, వైయస్ రాజశేఖరరెడ్డి, తన తమ్ముడు కూడా భూమి మీద నుంచి వెళ్లిపోయారని పాల్ గుర్తు చేసారు.

న్యాయస్థానంలో చూసుకుంటా..
అంతే కాకుండా తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు దొర కాదని, దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని ఘాటుగా స్పందించారు పాల్. తనను నేరుగా ఎదుర్కోలేక, తన సోదరుడి హత్య కేసును తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా స్వామ్యంలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడితే ఏం జరుగుతుందో అనేక సాక్షాలు ఉన్నాయని, చంద్రశేఖర్ రావు ఒకసారి చరిత్ర తిరగేయాలని పాల్ సూచించారు. తాను ఎలాంటి వివాదాస్పద అంశాల జోలికి వెళ్లనని, అనవసరంగా తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే క్షమించేది ఉండదని పాల్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications