Crop loss compensation: పంట నష్టం పరిహారం విడుదలంటూ ప్రకటన.. ఇంకా అందని నిధులు..!

తెలంగాణలో పలు జిల్లాల్లో వడగళ్ల వానలు పడి పంటలు నష్టపోయాయి. మార్చి 16 నుంచి 24 మధ్య కామారెడ్డి, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వర్షం కారణంగా పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఎన్ని ఎకరాల్లో పంట నష్టపోయిందో నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది.

ప్రభుత్వం ఆదేశంతో వ్యవసాయ అధికారులు సర్వే చేసి 15, 814.03 ఎకరాల విస్తీర్ణంలో వివిధ వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రభుత్వం ఎకరానికి రూ. 10 వేల చొప్పున 15 కోట్ల 81 లక్షల 41 వేల రూపాయలను రైతులకు పరిహారంగా మంజూరు చేస్తూ ఆర్థికపరమైన అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది రైతులకు పంట నష్టపరిహారం అందలేదు. కేవలం కొంత మందికి మాత్రమే అందినట్లు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.

Many farmers in the state are yet to receive the crop damage compensation money

కామారెడ్డి జిల్లాల్లో 10,328 ఎకరాల్లో పంట నష్టపోగా.. 9,107 రైతులకు పరిహారం రావాల్సింది. నిజామాబాద్ జిల్లో 1,652 ఎకరాల్లో పంట దెబ్బతినగా 1,809 రైతుకు పరిహారం చెల్లించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,014 ఎకరాలకు గానూ 1,036 రైతులు, సిద్దిపేట జిల్లాలో
746 ఎకరాలకు గానూ 793 మంది రైతులకు, మెదక్ జిల్లాలో 714.17 ఎకరాలకు గానూ 957 రైతులకు, ఆదిలాబాద్ జిల్లాలో
545 ఎకరాలకు గానూ 370 రైతులకు పరిహారం అందాల్సి ఉంది.

ఇక నిర్మల్ జిల్లాలో 332 ఎకరాలకు సంబంధించి 519 రైతులు, మంచిర్యాల జిల్లాలో 244 ఎకరాలకు గానూ 376 మంది రైతులకు, కరీంనగర్ జిల్లాలో 160 ఎకరాలకు సంబంధించి 160 మంది అన్నదాతలకు, సంగారెడ్డి జిల్లాలో 76 ఎకరాలకు గానూ 119 రైతులకు పంట నష్టపరిహారం రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+