జంపన్న కుట్రలు, నాశనం చేసేయత్నం: మావో నేత అభయ్ సంచలనం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు జంపన్నపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీకి జంపన్న తీరని ద్రోహం చేశారని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు.

మావోలు మారడం లేదు, బాధాకరమే, ద్రోహం కాదు: జంపన్న కీలక వ్యాఖ్యలు

ఇటీవల మావోయిస్టు నేత జంపన్న, తన భార్య రజితతో కలిసి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాను తిరిగి పార్టీలో చేరనని, సైద్ధాంతిక విభేదాల వల్లే తాను పార్టీని వీడానని చెప్పుకొచ్చారు.

ఇన్నాళ్లకు గుర్తొచ్చానా బిడ్డా: 40ఏళ్ల తర్వాత తల్లిని చూసి జంపన్న కంటతడి, భావోద్వేగ సంభాషణ

 జంపన్న కుట్రలు, కుతంత్రాలు

జంపన్న కుట్రలు, కుతంత్రాలు

కాగా, మావోయిస్టు పార్టీలో కుట్రలు, కుతంత్రాలు చేసి పార్టీని నాశనం చేసేందుకు జంపన్న ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ నేపథ్నంలోనే జంపన్నను ఏడాది క్రితం సస్పెండ్ చేశామని చెప్పారు. ఇలాంటి పనులు ఆపేయాలని గట్టిగా హెచ్చరించామని అభయ్ తెలిపారు.

లొంగిపోయానని చెప్పుకోవడం దారుణం

లొంగిపోయానని చెప్పుకోవడం దారుణం

అంతేగాక, జంపన్న లొంగిపోయాడని చెప్పుకోవడం వాస్తవం కాదని అన్నారు. తాము ఏడాది క్రితమే పార్టీ నుంచి బయటకు పంపామని చెప్పారు. మావోయిస్టు పార్టీలో ఉంటూ పలుమార్లు తమ సమాచారం లీక్ చేశాడని జంపన్నపై మండిపడ్డారు.

 పార్టీలో స్వేచ్ఛ ఉంది..

పార్టీలో స్వేచ్ఛ ఉంది..

జంపన్న.. సైద్ధాంతికతతో ఇమడలేకపోయానని చెప్పుకోవడం సరికాదని అన్నారు. పార్టీలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ఎవరైనా ఏదైనా చెప్పవచ్చని అభయ్ చెప్పుకొచ్చారు.

జంపన్నది మొసలి కన్నీరు

జంపన్నది మొసలి కన్నీరు

సిద్ధాంతాల పేరుతో మావోయిస్టు పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన జంపన్న... ఇప్పుడు పోలీసులకు లొంగిపోయిన తర్వాత.. మొసలి కన్నీరు కార్చడం దారుణమని అభయ్ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Maoist leader Abhay fired at former leader Jampanna formisleading parties system.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి