కోటి రూపాయల రివార్డు ఉన్న ఎవరీ హిడ్మా..ఏమిటీ హిడ్మా ప్రత్యేకత!

పోలీసులకు ఎంతోకాలంగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా హతమయ్యారు. ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆయనతోపాటు ఆయన భార్య కూడా రాజీ అలియాస్ రాజక్క కూడా కూడా మరణించారు. ఏపీ డీజీపీ హరీష్ గుప్తా మరణాలను ధ్రువీకరించారు.

మోస్ట్ వాంటెడ్ హిడ్మా బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
మోస్ట్ వాంటెడ్ గా ఉన్న, కోటి రూపాయలు రివార్డు ఉన్న హిడ్మా బ్యాగ్రౌండ్ ఏంటి? హిడ్మా టార్గెట్ గా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేశారు? అనేది వన్ ఇండియా ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పూర్వతి గ్రామంలో జన్మించిన బీజాపూర్ లోని స్థానిక తెగకు చెందినవాడు. 1981లో జన్మించిన ఆయన బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలో చేరి కాలంలోనే పార్టీలో కీలకంగా ఎదిగాడు.

maoist most wanted Hidma has a reward of one crore rupees what is special about Hidma

76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై దాడి ఘటనలో కీలకంగా హిడ్మా
అతను 2001 ప్రారంభంలో నక్సల్స్‌లో చేరినట్లు సమాచారం. కిషన్ జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పురిలో అడుగులు వేసిన ఆయన ఆపై జేగురుకొండ ప్రాంత దళ కమాండర్ గా పనిచేశాడు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన టేకుమట్ల దాడిలో ముందుండి నడిచాడు హిడ్మా. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మృతి చెందారు.

పదునైన, తెలివైన మావోయిస్ట్ హిడ్మా
అప్పటినుండి హిడ్మాకు మావోయిస్టులలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా బలగాల మెరుపు దాడిలో 24 మంది జవాన్లు మృతి చెందిన ఘటనలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు. హిడ్మా చాలా క్రమశిక్షణ, తెలివైన, పదునైన వ్యక్తి . అంతే కఠినంగా ప్రవర్తించగలిగిన వ్యక్తి అని , అందుకే అతను కమాండర్‌గా ప్రాముఖ్యత పొందాడని చెప్తారు.

27 కి పైగా దాడులకు పాల్పడిన హిడ్మా
మావోయిస్టుల లేథల్ బెటాలియన్ 1 యొక్క కమాండర్ గా పని చేసిన హిడ్మా భద్రతా దళాలకు వ్యతిరేకంగా కార్యకలాపాల యొక్క ఖచ్చితమైన ప్రణాళికలు రూపొందించటంలో అందెవేసిన చెయ్యి. హిడ్మలు అని కూడా పిలువబడే హిడ్మా 27 కి పైగా దాడులకు పాల్పడ్డాడు. ఫ్రంట్‌లైన్ కాంగ్రెస్ నాయకుల 2013 జిరామ్ ఘాటి ఊచకోత , ఏప్రిల్ 2017 బుర్కపాల్ ఆకస్మిక దాడి, ఇందులో 24 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మరణించారు.

మెరుపుదాడుల ఎక్స్పర్ట్ శకం ముగిసింది
76 మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందిన దంతేవాడ దాడి ఘటనలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు. గతంలో హిడ్మా కోసం ఆపరేషన్ ప్రహార్ నిర్వహించారు. 2000 మంది భద్రతా దళాలు హిడ్మా కోసం అడుగడుగున గాలించాయి. ఎన్నో సార్లు హిడ్మా దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు. గెరిల్లా ఆపరేషన్ చేయడంలో, మెరుపు దాడులు చేయడంలో దిట్ట అయిన హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. హిడ్మా శకం ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+