జూన్ 10న మావోయిస్టుల భారత్ బంద్.. ఇది సక్సెస్ అవుతుందా?
ఆపరేషన్ కగార్, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో మావోయిస్టులను తుడిచి పెట్టే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరాటం చేసిన భారత్, ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలిజం పైన అంతర్గత పోరు చేస్తుంది. ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీ కీలక నేతలను మట్టు పెడుతోంది.
భారత్ బంద్ కు మావోయిస్టుల పిలుపు
మావోయిస్టు పార్టీ కీలక నేత నంబాల కేశవరావుతో పాటు పలువురు అగ్రనేతలను ఇప్పటికే భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. అయితే ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ నేతలు శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ప్రస్తుతం మావోయిస్టులపై ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

జూన్ 11 నుండి మావోయిస్టు అమరవీరుల స్మారక సభలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కు వ్యతిరేకంగా కేశవరావుతో పాటు దళ సభ్యుల మృతికి నిరసనగా జూన్ 10వ తేదీన భారత్ బంద్ నిర్వహించాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. అంతేకాదు జూన్ 11వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మృతి చెందిన మావోయిస్టు అమరవీరుల స్మారక సభలను నిర్వహించనున్నట్టుగా వెల్లడించింది.
ఇప్పటివరకు 540 మందిని పోగొట్టుకున్నాం
2024 నుంచి ఇప్పటివరకు 540 మంది మావోయిస్టులు భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇటీవల తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తాము శాంతి చర్చలు జరపాలని కోరుతున్నామని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ఆపడం లేదని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
మావోయిస్టుల భారత్ బంద్ సక్సెస్ అవుతుందా లేదా?
గత రెండు నెలలుగా తాము సంయమనం పాటించామని, కేంద్ర రాష్ట్ర ఫాసిస్ట్ వైఖరికి నిరసనగా ప్రస్తుతం జూన్ 10వ తేదీన భారత్ బంద్ కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈ మేరకు లేఖను విడుదల చేశారు. మరి మావోయిస్టులు ప్రకటించిన ఈ భారత్ బంద్ సక్సెస్ అవుతుందా? ప్రజల్లో ఏ












Click it and Unblock the Notifications