Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డికి కేసీఆర్ అక్రమాస్తుల శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? మావోయిస్టుల లేఖ!!

కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పాలన కార్యక్రమంలో నిలదీయాలని, ఒత్తిడి చెయ్యాలని ప్రజలను కోరుతూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యుల పై మావోయిస్టు పార్టీ పలు ఆరోపణలు చేసింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కాంగ్రెసు ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించింది. స్వేద పత్రమంటూ పదేళ్లు తెలంగాణను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాలి వాస్తవానికి తెలంగాణ లో అన్నపు రాసులు ఒక చోట- ఆకలి దప్పులు ఒక చోట కేంద్రీకృతమయ్యాయని మావోయిస్ట్ పార్టీ ఆ లేఖలో పేర్కొంది. ఇక్కడి వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత పాలకులు దొరతనాన్ని పునర్నిర్మించారని మండిపడింది.

maoists shocking letter on kcr illegal assets and targets revanth reddy govt!!

కాళేశ్వరం పేరిట దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా అంతటా ప్రజలను వంచించారని ఆరోపించింది. ప్రభుత్వాలిచ్చే శ్వేత పత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదు. ఇక స్వేద పత్రాలు వాస్తవాలను వెల్లడించవు. అందువల్ల వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలని పేర్కొంది.

కేసీఆర్ కు అన్ని ఆస్తులెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మేఘ కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సెంటీజీల వివరాలేంటి? సెక్రెటేరియేట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? అని ప్రశ్నించింది.

ప్రజాకంటక నయీమ్ ముఠా ఎన్ కౌంటర్ అనంతరం జప్తు అయిన నాలుగయిదు వేల కోట్ల నగదు ఎవరికి చేరింది? ఇవన్నీ శ్వేత పత్రాల పరిధికి రావు గదా? ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్ని ఏ ప్రజాకోర్టులో పాలకులు శిక్షించగలరు? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్, కవిత మూడుకోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీము భండారం బయటకు రావాలని పేర్కొంది.

maoists shocking letter on kcr illegal assets and targets revanth reddy govt!!

శ్వేత పత్రాలు బయటపెట్టిన పాలకులు కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా? ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి.ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెసు ప్రభుత్వం ను విచారించాలని డిమాండ్ చేయండి అంటూ మావోయిస్ట్ పార్టీ పేర్కొంది.

కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చెయ్ముయాలని డిమాండ్ చేసింది. మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తామని పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ ను "ప్రజాపాలన"లో అడగండి, నిలదీయండని జగన్ లేఖలో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+