విషాదం: 10 గంటల్లో పెళ్ళి, అంతలోనే ఇలా... పెళ్ళి రద్దు, ఏమైంది?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఖమ్మం: పది గంటల్లో పెళ్ళి ..అయితే అనుకోని అవాంతరం చోటుచేసుకొంది. బంధుమిత్రుల ఆనందాలతో వివాహ వేడుకల మధ్య సంబరాలు జరగాల్సిన ఆ ఇల్లు నేడు విషాదంతో నిండిపోయింది. హఠాత్తుగా పెళ్ళికొడుకు తల్లి చనిపోయింది. పెళ్ళికొడుకు తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వివాహం నిలిచిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది.

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని మోటమర్రి గ్రామానికి చెందిన దారెల్లి వెంకటేశ్వర్లు, మరియమ్మ దంపతుల కుమారుడు గాంధీకి పదిరోజుల క్రితం కృష్ణా జిల్లా గంపలగూడెనికి చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్ధం జరిగింది.

ఈ నెల 19న, వివాహం జరపడానికి ముహుర్తం నిర్ణయించారు. శుభలేఖలను అందరికీ పంచారు. కుమారుడి పెళ్ళికి అందరూ రావాలని వంట చేసేందుకు, టెంటు వేసేటందుకు త్వరగా రమ్మని అందరికీ ఆహ్వనాలు పంపారు.

Mariyamma deaths for heart attack 10 hours before her son's marriage.

తెల్లవారితే వివాహం అన్ని పనులు పూర్తైతే బంధువులకు చెప్పింది. కానీ, విధి మరోలా తలచింది. అనుకోని విధంగా ఆదివారం రాత్రి ఒంటిగంటలకు మరియమ్మకు గుండెపోటుకు వచ్చింది. అంబులెన్స్ లో మధిర తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది.

భార్య మరణాన్ని తట్టుకోలేక వెంకటేశ్వర్లు కుంగిపోయారు. దీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, అతడిని ఆసుపత్రికి తరలించారు. పెళ్ళి ఇంట్లో విషాద వాతావరణం చోటుచేసుకొంది. ఈ ఘటనతో వివాహం రద్దయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mariyamma died for heart attack 10 hours before her son's marriage.This incident happend in Khammam district.
Please Wait while comments are loading...