తెలంగాణలో మమత బెనర్జీ పప్పులు ఉడకవు.!టీఎంసీ వృధా ప్రయత్నాలన్న మర్రి శశిధర్ రెడ్డి.!

హైదరాబాద్ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి కుమారి మమతా బెనర్జీ దక్షిణాదిలో అడుగుపెట్టాలని భావిస్తున్నారని, మిగతా రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం మమత కలలు కల్లలవుతాయని, మమత పప్పులు తెలంగాణలో ఉడకవని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేసారు. దక్షిణాదిలో తమకు అనుకూల పవనాలున్నాయా అని తెలుసుకునే ప్రయత్నం మమత మొదలు పెట్టిందని అన్నారు. కర్ణాటక, తెలంగాణలోని కొంతమంది బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులను సంప్రదించినట్లు ఇటీవల కొన్ని కథనాలు వెలువడ్డాయని, తెలంగాణాలో మాత్రం టీఎంసీ ఎటువంటి ప్రభావం ఉండదని శశిధర్ రెడ్డి స్పష్టం చేసారు.

 మమత నిలకడ లేని అడుగులు.. ప్రజలు గమనిస్తున్నారన్న మర్రి శశిధర్ రెడ్డి

మమత నిలకడ లేని అడుగులు.. ప్రజలు గమనిస్తున్నారన్న మర్రి శశిధర్ రెడ్డి

ఇటీవలి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బీజెపి వ్యూహాలను తిప్పికొట్టడంలో మమత బెనర్జీ సంపూర్ణ విజయం సాధించారు. అంతే కాకుండా టిఎంసికి నాయకత్వం వహించడంలో ఆమె విజయం సాధించింది. వారిప్పుడు ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై దృష్టి పెట్టారు, అది కూడా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ లేదని, భవిష్యత్తు ఉండదని, ఆ స్ధానాన్ని బీజెపి భర్తీ చేస్తుందని మమత విశ్లేషిస్తున్నారు. గాంధీజీ వారసత్వం, నెహ్రూ లౌకికవాదం మరియు నిజమైన కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా మమత చేసే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని శశిధర్ రెడ్డి అన్నారు.

 తెలంగాణలో టీఎంసీ ప్రభావం ఉండదు.. దీదీవి వృధా ప్రయత్నాలన్న మర్రి.

తెలంగాణలో టీఎంసీ ప్రభావం ఉండదు.. దీదీవి వృధా ప్రయత్నాలన్న మర్రి.

అంతే కాకుండా చరిత్రను ఒకసారి తిరగేస్తే మమత గురించి కొన్ని సంఘటనలు వెలుగులోకి వస్తాయన్నారు మర్రి. టీఎంసీ గతంలో ఎన్‌డిఎలో భాగస్వామ్యంగా ఉందని, అంతే కాకుండా అప్పటి ప్రధాని వాజ్‌పేయి మంత్రివర్గంలో ఆమె మంత్రిగా ఉన్నారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని శశిదర్ తెలిపారు. మమతా బెనర్జీ ప్రధాని మోదీని, ఇటీవల పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలవడం జరిగిందని, ఏ గాడ్సే వారసలులైతే 2014 తరువాత అధికారంలోకి వచ్చారో వారికి అన్నివిధాలా అండ దండగా ఉంటూ పరస్పరం సహకరించుకుంటున్న వారికి మమతా నాయకత్వం వహిస్తారంటే ఎవరు నమ్మరని అన్నారు. ఇటీవల ప్రధాని మోదీతో మమత సమావేశం గురించి ప్రజల్లో భిన్నమైన చర్చ జరుగుతోందని అన్నారు.

 కాంగ్రెస్ లేకుండా మూడో కూటమా.? హాస్యాస్పదంగా ఉందన్న శశిధర్ రెడ్డి

కాంగ్రెస్ లేకుండా మూడో కూటమా.? హాస్యాస్పదంగా ఉందన్న శశిధర్ రెడ్డి

ఇదే కాకుండా ఎలక్షన్ వ్యూహాలలో బాగా పేరు సంపాదించినా ప్రశాంత్ కిషోర్ పాత్ర పై కూడా అందరికి పెను అనుమానాలున్నాయని శశిధర్ రెడ్డి తెలిపారు. పీకే మోడీ-షా ద్వయానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వారిచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపును ప్రశాంత్ కిషోర్ చిలుకలాగా పలుకుతున్నారని కాంగ్రెస్ వాదులు చాల మంది భావిస్తున్నారని అన్నారు. ఆయన మార్గనిర్దేశంతో, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించవచ్చని టిఎంసి భావిస్తే, అది వ్యర్థమైన కసరత్తు అవుతుందని, తెలంగాణలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని శశిధర్ రెడ్డి అన్నరు.

 తెలంగాణలో ప్రజలు మమతను వ్యతిరేకిస్తారు. టీఎంసీ పప్పులు తెలంగాణలో ఉడకవన్న శశిధర్ రెడ్డి.

తెలంగాణలో ప్రజలు మమతను వ్యతిరేకిస్తారు. టీఎంసీ పప్పులు తెలంగాణలో ఉడకవన్న శశిధర్ రెడ్డి.

ప్రధాన మంత్రి మోడీ మరియు బిజెపిని తీవ్రంగా, ఏకధాటిగా ఎదుర్కొంటున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని, దేశంలోని అన్ని రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడని, అన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉన్న పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని అన్నరు. పార్టీలో గతం చోటుచేసుకున్న పరిణామాలను గమనించి, ఆ అనుభవంతో తగు పాఠాలను నేర్చుకోవాలని, మన బలాలు మరియు బలహీనతలను తిరిగి అంచనా వేయాలని, మరియు దేశంలోని నిజమైన బిజెపి వ్యతిరేక ఫ్రంట్ శక్తులకు నిజమైన కేంద్ర బిందువు లాగా కాంగ్రెస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వ్యూహాలను రూపొందించుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+