ప్రేమించి పెళ్లి చేసుకుని రాచిరంపాన పెట్టాడు: మంటల్లో కాలి బూడదైన మహిళ

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఓ వ్యక్తి రాచి రంపాన పెట్టాడు. పిల్లలు పుట్టడం లేదనే కాకుండా అదనపు కట్నం తేవాలని వేధిస్తూ వచ్ాడు. ఈ స్థితిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి మరణించింది.

హైదరాబాదు సమీపంలోని పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ సంఘటన చోటు చేసుకుంది. ఈసిఐఎల్‌కు చెందిన సుశీల కూతురు శ్రీలత అలియాస్ భాగ్యలక్ష్మి (29) డిగ్రీ చదువుకుంది. దేవర యాంజాల్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వరుసకు మేనమామ అయ్యే పోచయ్య (31)ను ఆమె తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకుంది.

Married woman commits suicide near Hyderabad

2007లో వారిద్దరు ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె దేవర యంజాల్‌లోని అత్తగారింట్లో ఉంటోంది. పెళ్లి అయిన తర్వాత కొంత కాలం వరకు శ్రీలతను పోచయ్య బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత పిల్లలు కలగడం లేదంటూ అందరి ముందూ అవమానిస్తూ వచ్చాడు.

ఈ క్రమంలో ఆమె పుట్టింటి నుంచి రూ. 50 వేలు తెచ్చి ఇచ్చింది. దాంతో అతను బైక్ కొన్నాడు. తర్వాత ఆటో ట్రాలీ కొనేందుకు రూ. లక్ష కావాలని, వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రూ.80 వేలు కావాలని, వాటిని పుట్టింటి నుంచి తెచ్చివ్వాలని శ్రీలతను వేధిస్తూ వచ్చాడు.

Married woman commits suicide near Hyderabad

అందుకు శ్రీలత నిరాకరించింది. దీంతో ఇరువురి మధ్య పది రోజులుగా రాత్రి సమయంలో గొడవ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి పోచయ్య భార్యతో గొడవ పెట్టుకుని తీవ్రంగా ఆమెను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలత చచ్చిపోతానంటూ బెదిరించింది. చావు అంటూ అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

సోమవారం తెల్లవారుడు జామున నాలుగున్నర గంటల ప్రాంతంలో ఇంట్లోంచి మంటలు వచ్చాయి. ఆ మంటల్లో శ్రీలత కాలి బూడిదైంది. ఇంట్లో గ్యాస్ స్టౌవ్ ఉండగా, కిరోసిన్ ఎందుకు వచ్చిందనేది ప్రశ్నగా మిగిలింది. భర్తే కిరోసిన్ పోసి భార్యను హతమార్చాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+