Kamareddy News: దృశ్యం సినిమా చూపించిన ప్రియుడు, ప్రియురాలు.. భర్తను చంపి ఏం చేశారంటే..
దృశ్యం సినిమా అందికి సుపరిచితమే ఇందులో మీనా ఓ అబ్బాయిన చంపుతుంది. ఆ తర్వాత వెంకటేశ్ ఆ డెడ్ బాడీని కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ లో పాతిపెడతాడు. ఇది సినిమా కానీ నిజ జీవితంలో ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఓ వివాహిత ప్రియుడితో కలిసి భర్తను చంపి కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో పాతి పెట్టింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక రాష్ట్రంలోని బందెంపల్లి గ్రామానికి చెందిన ఎరుకల రమేశ్‌కు వికారాబాద్ జిల్లా బషీ రాబాద్ మండలంలోని నీలపల్లి గ్రామానికి చెందిన వెన్నెలతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది.

తరచూ గొడవలు
వీరు నాలుగేళ్ల క్రితం పటాన్‌చెరు ప్రాంతంలోని లింగంపల్లి శివారుకు వలస వచ్చారు. అక్కడ దౌల్తాబాద్ మండలం భూమిడాల గ్రామానికి చెందిన గంగపురి దస్తప్పతో వెన్నెలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగాయి. దీంతో వారు తమ స్వస్థలానికి వెళ్లిపోయారు. కొద్ది రోజుల తర్వాత కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఓ ఇంటి నిర్మాణానికి కూలీలుగా వచ్చారు. పనులు చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నారు. తను ఎల్లారెడ్డి వచ్చినట్లు ప్రియుడికి చెప్పింది వెన్నెల.. దీంతో అతను ఆమెను అప్పుడప్పుడు వస్తూ కలుస్తున్నాడు.

ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే..
గతనెల 30న రాత్రి 11 గంటల సమయంలో వెన్నెల కోసం వచ్చిన ఆమె దస్తప్పని భర్త రమేశ్ చూశాడు. దీంతో దస్తప్ప రమేష్ గొంతు నులమగా భార్య వెన్నెల కాళ్లు పట్టుకుని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని వారు కూలీలుగా పనిచేస్తున్న ఇంటి ఆవరణలోనే పాతి పెట్టారు. వెన్నెల మరుసటి రోజు రమేశ్ అన్న వెంకటప్పకు ఫోన్ చేసి తన భర్త ఎవరో బంధువులు మృతి చెందారని చెప్పి కర్ణాటకకు వచ్చాడని చెప్పి.. మూడు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లింది.

పోలీసులకు ఫిర్యాదు
అనుమానించిన రమేశ్ అన్న వెంకటప్ప గురువారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. నిందుతురాలిని విచారించగా అసలు విషయం బయట పడింది. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్ సంఘటన స్థలానికి చేరుకుని తహసీల్దార్ మునీరుద్దీన్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం కుళ్లిపోవడంతో వైద్యులు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నిందితుడు దస్తప్ప కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications