కరివేపాకులా వాడుకుని వదిలేశారు: చంద్రబాబుపై మత్తయ్య ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కరివేపాకు మాదిరిగా వాడుకొని వదిలేశారని, దాంతో తనకు రక్షణ కరువైందని ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్‌సి)కి ఫిర్యాదు చేశారు.
తాను సుమారు ఆరు నెలల నుంచి ఇంటికి వెళ్లడం లేదని చెబుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నందున తనకు రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి, కేసులో ప్రతివాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణహాని ఉందని చెప్పారు. తన ఇంటి వద్ద కొందరు తనను చంపేందుకు రెక్కి నిర్వహించినట్లు తెలిసిందన్నారు.
ఇంటి వద్ద పోలీసు రక్షణ కల్పించి ప్రాణాలను కాపాడాలని హెచ్‌ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తన ప్రస్తుత పరిస్థితికి కారకులని ఆరోపించారు. ఆయన వెంట ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బిషప్ స్వామిదాస్ ఉన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications