టాలీవుడ్ లాగేసుకుంటుందేమో: కేటీఆర్ ‘ఫోజుల’ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్ర ఆసక్తికరం
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర మధ్య ఆసక్తికరంగా ట్విట్టర్ సంభాషణ సాగింది. మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేస్తానని కేటీఆర్ చేసిన కామెంట్‌కు ఆనంద్ మహీంద్ర సరదాగా స్పందించారు. మీరు(కేటీఆర్) కెమెరా ముందుకొస్తే టాలీవుడ్ లాగేసుకుంటుందంటూ మహీంద్ర వ్యాఖ్యానించారు.
మహీంద్ర ట్రాక్టర్ల ముందు నిలబడి ఫోజులిస్తానంటూ కేటీఆర్
ఆ వివరాల్లోకి వెళితే.. జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ యూనిట్‌ను కేటీఆర్ బుధవారం సందర్శించడంతోపాటు ట్రాక్టర్ నడిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌లో తెలియజేస్తూ.. 'మహీంద్రాజీ మీరు మా రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడితే మీ ట్రాక్టర్లకు మార్కెటింగ్ చేసేందుకు నేను రెడీ. అందుకోసం మీ ట్రాక్టర్ల ముందు నిలబడి ఫొటోలకు ఫోజులిస్తా' అని ట్వీట్ చేశారు.
టాలీవుడ్ లాగేసుకుంటుందంటూ కేటీఆర్‌పై ఆనంద్ మహీంద్ర
ఈ క్రమంలో కేటీఆర్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా వెంటనే స్పందించారు. 'కేటీఆర్, మీరు తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్ అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు కెమెరా ముందుకొస్తే రాకెట్ వేగంతో దూసుకుపోతున్న టాలీవుడ్ మిమ్మల్ని తనవైపు లాగేసుకుంటుంది' అంటూ ఆనంద్ చమత్కరించారు. దీంతో వీరిద్దరి ట్వీట్లపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్ానరు.
Recommended Video


కేంద్రమంత్రి పూరీతో మంత్రి కేటీఆర్ భేటీ
ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్లాన్‌కు ఆర్థిక సాయం చేయాలని కేంద్రమంత్రిని కేటీఆర్ కోరారు. ఎస్‌టీపీల నిర్మాణాలకు రూ. 8,654.54 కోట్లు ఖర్చు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో మూడో వంతు అమృత్-2 కింద రూ. 2,850 కోట్లు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో వ్యక్తిగత రాపిడ్ ట్రాన్సిట్ కారిడార్‌కు సహకరించాలని కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.