• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నగరంలో మేయర్ ఆకస్మిక తనిఖీలు.!పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విజయలక్ష్మి.!

|

హైదరాబాద్ : నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పారదర్శక పాలన, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గత పదిహేను రోజుల క్రిందట ఆరు జోన్లలో విస్త్రుతంగా పర్యటించి పారిశుద్య పరిస్థితిని మెరుగుపరిచిన మేయర్ విజయలక్ష్మి ప్రస్తుతం అదే కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. మే నెల కావడంతో అకాల వర్షాలు, ఉరుములు, ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యంత్రాంగాన్ని సమాయత్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేయర్ విజయలక్ష్మి.

నగరంలో పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి.. మళ్లీ ఆకస్మిక తరిఖీలు చేపట్టిన మేయర్..

నగరంలో పారిశుద్యంపై ప్రత్యేక దృష్టి.. మళ్లీ ఆకస్మిక తరిఖీలు చేపట్టిన మేయర్..

మంగళవారం ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మొదట నాంపల్లి స్టేషన్ రోడ్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్ అక్కడ నుండి కోటి ఈ ఎన్ టీ హాస్పిటల్ ను సందర్శించారు. జోనల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి అక్కడ జరుగుతున్న పారిశుద్ధ్య పనులు మరియు హాస్పిటల్ లో అన్నీ బ్లాక్ లను పరిశీలించి అక్కడ కరోనా పేషంట్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. తరువాత మలక్ పేటలో మరియు మూసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని ఆదేశించారు. బ్రిడ్జ్ కింద పేరుకుపోయిన చెత్తను చూసి అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్ కింద అలా చెత్త పేరుకుపోయి ఉంటే నీటి ప్రవాహం ఆగి పోతుందని, దానిని తొలగించాలని ఆదేశించారు.

వచ్చేది వర్షాకాలం.. అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ విజయలక్ష్మి..

వచ్చేది వర్షాకాలం.. అప్రమత్తంగా ఉండాలన్న మేయర్ విజయలక్ష్మి..

అంబర్ పేట అలీ కేఫ్ వద్ద మరియు అన్నపూర్ణ నగర్, వేంకటేశ్వర నగర్, జిందా తీలిస్మాత్ రోడ్డులో రోడ్డుపై చెత్తను చూసిన మేయర్ అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడారు. చెత్త ఆటో రావడం లేదని తెలుసుకొని సదరు చెత్త ఆటో వారిని పిలిపించి రోజు కచ్చితంగా ఇంటి ఇంటికి చెత్త సేకరణ కచ్చితంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసారు. డీసి వేణు గోపాల్ మరియు ఏఎమ్ఓహెచ్ డాక్టర్ హేమలత కు ఎస్ఎఫ్ఏలు పని చేయకపోతే వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని, పారిశుద్ధ్య కార్మికులు 50 ఏళ్లు దాటిన వారి స్ధానంలో వారి కుటుంబ సభ్యులను నియమించే విధంగా కార్యాచరణ రూపొందించాలని మేయర్ ఆదేశించారు.

అశ్రద్ద వహిస్తే వేటు తప్పదు.. పారిశుద్య కార్మికులకు మేయర్ వార్నింగ్..

అశ్రద్ద వహిస్తే వేటు తప్పదు.. పారిశుద్య కార్మికులకు మేయర్ వార్నింగ్..

ఏంటమాలజీ వారు ప్రతి రోజు తప్పకుండా ఫాగింగ్ చేపట్టాలని మేయర్ ఆదేశించారు. గోల్నాక, కాచిగూడ, ఖైరతాబాద్, చింతల్ బస్తీ, బంజారహీల్స్, దేవరకొండ బస్తీతో పాటు పలు చోట్ల ప్రైవేట్ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం గమనించిన మేయర్ త్వరలో ఇలాంటి వాటిపై ఒక యాక్షన్ ప్లాన్ సిద్దం చేసే విదంగా చర్యలు తీసుకుంటామన్నారు. పలు చోట్ల వర్షపు నీటిని తొలగించాలని మేయర్ ఆదేశించారు.మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ పరిదిలో ఉన్న అన్నీ అన్నపూర్ణ సెంటర్ లలో 5 రూపాయల భోజనాన్ని నేటి నుండి ఉచితంగా ఇస్తున్నామని మేయర్ తెలిపారు.

ఫలితం ఇచ్చిన ఫివర్ సర్వే.. సంతృప్తి వ్యక్తం చేసిన గద్వాల విజయలక్ష్మి..

ఫలితం ఇచ్చిన ఫివర్ సర్వే.. సంతృప్తి వ్యక్తం చేసిన గద్వాల విజయలక్ష్మి..

ఫీవర్ సర్వే నిన్న సోమవారం వరకు మొత్తం 30 సర్కిల్లలో 1680 టీంలతో 9,98,373 మందికి పూర్తి చేయడం జరిగిందని మేయర్ తెలిపారు. అలాగే బస్తీ దవాఖానా లలో మొత్తం ఓపీల ద్వారా 2,19,333 మందికి ఫీవర్ టెస్ట్ లు చేయడం జరిగిందన్నారు. అన్నపూర్ణ సెంటర్ ల ద్వారా నిన్న మొత్తం 49,810 మందికి 130 రెగ్యులర్ సెంటర్ లు, 107 టెంపరరీ సెంటర్, 24 ప్యాకింగ్ సెంటర్ ల ద్వారా ఫుడ్ అందించడం జరిగిందని మేయర్ తెలిపారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా మహమ్మారిని తరిమికొట్టాని మేయర్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.

English summary
City Mayor Gadwala Vijayalakshmi seems to be focused on transparent governance and public welfare.It seems that Mayor Vijayalakshmi, who visited six zones extensively over the past fortnight to improve the sanitation situation, is now embarking on the same program again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X