Medaram Jatara 2024: జంపన్నవాగు ఎందుకు ఎరుపెక్కింది? సంపెంగవాగు జంపన్నవాగుగా ఎందుకు మారింది?
ఆసియా ఖండంలోనే అపురూపమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరలో కోట్లాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. ముఖ్యంగా జాతరకు వచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునే ముందు జంపన్న వాగులో స్నానమాచరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఒకప్పుడు సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగుగా ఎందుకు మారింది? ఈ వాగులోని నీరు ఎందుకు ఎరుపెక్కింది? మీ వన్ ఇండియా స్పెషల్..
మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో స్నానమాచరించి, జంపన్న వాగును పూజించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జంపన్న వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యంగా ఉంటామని, గిరిజన వీర యోధుల వీరత్వం కారణంగా జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు. అసలు ఎందుకు సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది అన్న కథనానికి వెళితే..

కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉన్న మేడారం రాజు పగిడిద్దరాజు మేడారంలో వచ్చిన కరువు కాటకాలతో కప్పం కట్టలేక కాకతీయ రాజులకు ఎదురు తిరిగాడు. ఫలితంగా కాకతీయ రాజులు మేడారం రాజ్యంపై యుద్ధం ప్రకటించారు. పగిడిద్దరాజు కుటుంబం పగిడిద్దరాజు, పగిడిద్దరాజు భార్య సమ్మక్క, సమ్మక్క కుమార్తె సారలమ్మ, సారలమ్మ భర్త గోవిందరాజులు, మరో కుమార్తె నాగులమ్మ, సమ్మక్క కుమారుడు జంపన్న కాకతీయ రోజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడారు.
యుద్ధంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు, నాగులమ్మలను కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మృతి చెందారు. అప్పటికే యుద్ధంలో తీవ్ర గాయాలపాలై, పోరాటం చేస్తున్న జంపన్న వారి మరణ వార్త విని, శత్రువుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. నాడు జంపన్న రక్తంతో ఎరుపెక్కిన సంపెంగ వాగు నేటికీ ఎర్రగానే ఉంటుందని చరిత్ర చెప్తుంది.
అయితే సంపెంగ వాగు గోదావరి నదికి ఉపనదిగా ఉంది. సహజంగా గోదావరి నీరు ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఈ వాగులో నీరు ఎర్రగా ఉంటుందనేది కొందరి వాదన. ఏది ఏమైనా జంపన్న వాగులోని ఎర్రటి నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల తమను రక్షించే సమ్మక్క సారలమ్మల త్యాగం గుర్తుకు వస్తుందని, వారిలో అది ధైర్యాన్ని నింపుతుందని గిరిజనుల నమ్మకం.
ఒకప్పుడు గిరిజనుల నమ్మకం.. ఇప్పుడు అందరి నమ్మకంగా మారింది. అందుకే జంపన్న వాగులో స్నానమాచరించి, సమ్మక్క కొడుకును ప్రార్ధించిన తర్వాతనే, తల్లుల గద్దెల వద్దకు వెళతారు భక్తులు. మేడారం జాతరకు వచ్చే ప్రతీ ఒక్కరూ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతే తల్లుల చెంతకు వెళ్ళటం కనిపిస్తుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications