మేడారం సమ్మక్క సారలమ్మ జాతర చరిత్ర.. ఆశ్చర్యకర విషయాలు!
మేడారం మహా జాతర ... ప్రపంచంలోనే ఆదివాసీలు జరుపుకునే అతిపెద్ద మహా జాతర ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అటువంటి మహా జాతర తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అటవీప్రాంతంలో జరుగుతుంది. గిరిజనులు, ఆదివాసీలు, అతి సామాన్య కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కువగా తరలివచ్చే ఈ జాతరలో ప్రతిదీ విశేషమే.ములుగు జిల్లాలోని మేడారంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర ప్రతి ఒక్కరికి ఒక పులకింత.
మేడారం జాతర ఇలా
ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల నుండి కోట్లాదిమంది భక్తజనం తరలివచ్చి తల్లులను దర్శించుకుంటారు అంటే సమ్మక్క, సారలమ్మల మహత్యం ఎంతటిదో అర్థమవుతుంది. నాలుగు రోజుల పాటు సాగే మేడారం జాతరలో జనవరి 28వ తేదీన కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెల మీదికి తీసుకువస్తారు. 29వ తేదీన చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దె మీదకు తీసుకువస్తారు. ఇద్దరు మేడారం చేరుకోవడంతో జాతర ఊపందుకుంటుంది.

మేడారం జాతర చరిత్ర
అసలు మేడారం మహా జాతరకు ఎందుకు ఇంత ప్రాశస్త్యం? మేడారంలో కొలువైన ఈ సమ్మక్క సారలమ్మలు ఎవరు? వారి చరిత్ర ఏమిటి? అంటే 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించిన ఆదివాసి దొర మేడరాజు. ఆయన ఏకైక కుమార్తె సమ్మక్కను, మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ మరియు జంపన్న అనే ఇద్దరు సంతానం.
మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండయాత్ర
కాకతీయులకు చెల్లించాల్సిన కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. దాడిని తట్టుకోలేక మేడరాజు మేడారం వెళ్లి అజ్ఞాతవాసం గడుపుతాడు. మేడారం పాలకుడు పగిడిద్దరాజు కూడా కరువు కారణంగా కప్పం కట్టలేకపోతాడు. అంతే కాదు మేడరాజుకు ఆశ్రయం కల్పించాడన్నది, తిరుగుబాటు భావాలు పెంచుతున్నాడన్న ఆరోపణలతో ప్రతాపరుద్రుడు ఆగ్రహించి, తన మంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.
కాకతీయులతో పోరాడిన ధీర చరితలు
సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు, సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడినా, అపార కాకతీయ సేనల ముందు ఓడిపోతారు.ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందుతారు.ఈ వార్త విన్న జంపన్న, అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది.
తల్లీ కూతుళ్ళ ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ గిరిజనుల జాతర
అపర కాళిలా కాకతీయులపై విరుచుకుపడిన సమ్మక్క కాకతీయుల వెన్నుపోటుతో చిలకలగుట్ట పైకి వెళ్లి అంతర్దానమయ్యింది. అప్పటి నుండి ఆ తల్లి, కూతుళ్ళ ధీరత్వాన్ని గుర్తు చేసుకుంటూ గిరిజనులు మేడారం జాతర నిర్వహిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం మేడారం జాతరను అధికారిక పండుగగా నిర్వహిస్తుంది అంటే ఆ తల్లుల మహత్యం తెలుసుకోవచ్చు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications