మేడారం జాతరలో గద్దెల వద్దకు ముందు వచ్చేది సారలమ్మ కాదు.. ఎవరంటే!

మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో తొలిగా గద్దెల వద్దకు వచ్చేది సారలమ్మ అని చెప్తారు కానీ కాదు, తొలిగా గద్దెలపైకి లక్ష్మీ దేవర వస్తుంది. అసలు ఎవరీ లక్ష్మీ దేవర, ఆమెకు మేడారం జాతరకు సంబంధం ఏంటి? అనేది కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.

మేడారం జాతరలో గద్దెల వద్దకు తొలిగా వచ్చేది ఈ దేవతనే

సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రారంభ వేళలోనూ, జంపన్న వాగు వద్ద డప్పులు, వాయిద్యాల నడుమ లక్ష్మీ దేవర ఆడుతూ తిరుగుతూ కనిపిస్తుంది. ఈ ఆదివాసీ దేవతకు సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు, సంప్రదాయాలు గిరిజన సంస్కృతికి అద్దం పడతాయి. లక్ష్మీదేవర నాయక్‌పోడ్ అనే గిరిజన తెగకు ఆరాధ్య దైవం. ఆదివాసీలు చెప్పే దాని ప్రకారం సమ్మక్కకు ఓ ఆడపడుచు ఉండగా ఆమెనే లక్ష్మీదేవరగా గిరిజనులు విశ్వసిస్తారు.

Medaram Jathara Lakshmi Devara Horse Head Tribal Deity comes first on to medaram gaddelu

తొలిగా గద్దెల వద్దకు రానున్న సమ్మక్క ఆడబిడ్డ

జయశంకర్ జిల్లా గణపురం మండలం బూరుగుపేట-నగరంపల్లిలో నేటికీ లక్ష్మీదేవర మహిమలు వెదురు చెట్టు రూపంలో దర్శనమిస్తాయని స్థానికులు చెబుతారు. లక్ష్మీదేవరకు అక్కడ ఒక పురాతన ఆలయం కూడా ఉంది. లక్ష్మీదేవర గుర్రం రూపంలో దర్శనమిస్తే, పోతరాజు, కిష్టస్వామి చెక్కబొమ్మల రూపంలో పూజింపబడతారు. మేడారం జాతర సందర్భంగా, పగిడిద్దరాజు సోదరి అయిన లక్ష్మీదేవర అమ్మవారిని నాయక్‌పోడ్ గిరిజనులు గద్దెల వద్దకు తీసుకువస్తారు.

55కిలోమీటర్లు నడిచి రానున్న లక్ష్మీ దేవర

మేళతాళాలు, నృత్యాలతో తమ ఆరాధ్య దేవతను పగిడిద్దరాజు వద్దకు తీసుకెళ్లడం ఆనవాయితీ. ఈ ఊరేగింపులో సంతానం లేని దంపతులు వచ్చి ఆశీర్వాదం తీసుకునే సంప్రదాయం కూడా ఉంది.మేడారం గద్దెలకు అందరికన్నా ముందుగా చేరుకునే దేవత లక్ష్మీదేవర. నాయక్‌పోడ్ తెగకు చెందిన రెడ్డి, తగిన, మేకల వంశీయులు సుమారు 55 కిలోమీటర్ల మేర అటవీ మార్గాల్లో నడుచుకుంటూ బూర్గుపేట, కాల్వపల్లి, దూదేకులపల్లి మీదుగా అమ్మవారిని మేడారం తీసుకువస్తారు.

లక్ష్మీదేవరకు నాయక్ పోడ్ గిరిజనుల జాతర

ఉపవాస దీక్షతో, అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ యాత్ర సాగుతుంది.నగరంపల్లిలోని నాయక్‌పోడ్ వీధిలో లక్ష్మీదేవర నివసించిన ప్రాంతంలో ఇప్పటికీ రెండు వెదురు చెట్లు వందల ఏళ్లుగా పచ్చగా ఉండటం లక్ష్మీదేవర మహత్యానికి నిదర్శనమని పూజారులు చెబుతారు. లక్ష్మీదేవర జాతరను ములుగు జిల్లా వెంకటాపురం మండలం బూరుగుపేట గ్రామంలో నాయక్‌పోడ్ గిరిజనులు ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత (మార్చి-ఏప్రిల్ నెలల్లో) నిర్వహిస్తారు.

నగరంపల్లి నుంచి మేడారం వచ్చే లక్ష్మీ దేవర

మహాజాతర ప్రారంభానికి వారం ముందు పగిడిద్దరాజు కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుంచి బయలుదేరతారు. సమ్మక్క ఆడబిడ్డ లక్ష్మీదేవర నగరంపల్లి నుంచి మేడారం చేరుకోవడం ఆనవాయితీ. అదే సమయంలో మేడారంలో మండమెలిగే పండగ నిర్వహించడం ద్వారా జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో గిరిజనులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

లక్ష్మీదేవర ఆకృతి ప్రత్యేకత

లక్ష్మీదేవర ఆకారాన్ని నకాషీ కళాకారులు గుర్రం తల రూపంలో తయారు చేస్తారు. వెదురు కట్టెలతో పెద్ద బుట్టలా అల్లుకుని ఆ ఆకారాన్ని రూపొందిస్తారు. దానిపై ఎరుపు రంగు వస్త్రాలు కప్పి, లోపల ఒక వ్యక్తి నిలుచుని కదులుతూ ఊరేగింపులో పాల్గొంటాడు. అతని వెంట పూజారులు, వాయిద్యకారులు ఉండటం మేడారం జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+