ఘోర రోడ్డు ప్రమాదం: మహిళపైనుంచి దూసుకెళ్లిన లారీ(వీడియో)
రంగారెడ్డి: మేడ్చల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మేడ్చల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ప్రియ అనే మహిళ.. గురువారం ఉదయం రోజూలాగే తన స్కూటర్‌పై రహదారిపైకి వచ్చింది.
స్థానిక వివేకానంద విగ్రహం వద్ద రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టింది. ఆ తర్వాత లారీ చక్రాల కింద పడిపోయిన ప్రియా తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాద ఘటన కలచివేసేలా ఉంది. రోడ్డు దాటుతున్న ప్రియ.. వెనుకవైపు నుంచి వస్తున్న లారీని గమనించకపోవడంతో.. లారీ వేగంగా వస్తుండటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
A woman was killed in a #RoadAccident after her Activa was hit by a lorry and ran over her, while crossing the road without watching left side, at #Medchal near #Hyderabad on Thursday morning. She was works in a Security company. Follow #TrafficRules.#RoadSafety #BikeAccident pic.twitter.com/HleOfp0phB
— Surya Reddy (@jsuryareddy) September 29, 2022
రోడ్డుపైకి వస్తున్నప్పుడు వాహనాలను జాగ్రత్తగా నడపాలని, అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలను కూడా గమనించాలని ప్రమాద వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె రోడ్డు క్రాస్ చేస్తున్నప్పడు వెనుకవైపు నుంచి వస్తున్న లారీని గమనించినట్లయితే.. ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదని అంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications