నెల క్రితమే పెళ్లి: హాస్టల్ గదిలో వైద్య విద్యార్థిని సౌమ్య ఆత్మహత్య
కరీంనగర్: కరీంనగర్ జిల్లా నగునూరులోని ప్రతిమ వైద్య కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డెర్మటాలజీలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెకు నెల రోజుల క్రితమే వివాహమైంది. ఆమె స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని మన్రీలియగూడెం.

గత నెల 27వ తేదీన సౌమ్యకు వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఇంటి నుంచి మళ్లీ కాలేజీకి వచ్చిన సౌమ్య ఆత్మహత్య చేసుకోవడం వెనక కారణాలేమిటనేది తెలియడం లేదు.
నల్లగొండ జిల్లాకు చెందిన పవన్ కుమార్ రెడ్డి అనే యువకుడికి ఆమెకు పెళ్లయింది. పెళ్లయిన తర్వాత భర్తతో కలిసి మంగళవారంనాడు కాలేజీకి వచ్చింది. హాస్టల్ గదిలో వదిలిపెట్టిన అతను వెళ్లిపోయాడు. ఆ రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుంది.
తమ సోదరి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లి కారణంగానే ఆత్మహత్య చేసుకుందని సౌమ్య సోదరుడు అంటున్నారు. పోలీసులు భర్త కోసం ఆరా తీస్తున్నారు. భర్త పవన్ కుమార్ రెడ్డి కూడా వైద్యుడే. భర్త మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీలో ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications