నాలుగు నెలల తర్వాత ప్రీతి హాస్టల్ గదిని తెరిచిన పోలీసులు: 970 పేజీల ఛార్జీషీట్ దాఖలు
వరంగల్: సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడిన కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి హాస్టల్ గదిని పోలీసులు బుధవారం తెరిచారు. కేఎంసీ హాస్టల్‌లో దాదాపు నాలుగు నెలలుగా మూసివున్న రూం నెంబర్ 409ని.. ప్రీతి కుటుంబసభ్యులు, అధికారుల సమక్షంలో పోలీసులు లాక్ ఓపెన్ చేశారు.
ఆ సమయంలో గదిలో ప్రీతి వస్తువులను చూసిన ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రీతి లగేజీ ప్యాక్ చేసి అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రీతి హాస్టల్ గదిలో ఇంజెక్షన్లు, సూదులు, మెడికల్ కిట్స్ లభ్యమయ్యాయి. మరోవైపు, మెడికోప్రీతి ఆత్మహత్యకేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కులం పేరుతో దూషించినందువల్లే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించిందని పేర్కొన్న పోలీసులు.. సీనియర్ సైఫ్ వేధింపులే అందుకు ప్రధాన కారణమని 970 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు.

కులం పేరు ప్రస్తావించడంతో పాటు ర్యాగింగ్ చేయడంతో.. ప్రీతి డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుందని చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ప్రీతి 2022 నవంబర్‌లో కేఎంసీలో జాయిన్ అయినప్పటి నుంచి సైఫ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు అందులో పేర్కొన్నారు. కులం పేరుతో హేళన చేస్తూ.. ప్రీతిని సైఫ్ దూషిస్తూ వచ్చాడు. అది ఆమె భరించలేకపోయింది. మానసికంగా ఇబ్బందికి గురయ్యింది.
ఆ వేధింపులు భరించలేక.. ప్రీతి ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఉదయం 08.10 గంటలకు ఆత్మహత్యాయత్నం చేసిందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిందని ఛార్జిషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీలో మెడికో(పీజీ) చదువుతున్న ధారవత్ ప్రీతి నాయక్.. సీనియర్ సైఫ్ నుంచి వేధింపులు భరించలేక పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురై కన్నుమూసింది.
ఈ కేసులో 70 మంది సాక్షులను విచారించి.. సైంటిఫిక్, టెక్నికల్, మెడికల్, ఫోరెన్సిక్ నిపుణల సహకారంతో మృతురాలు, నిందితుడు, వారి మిత్రులు వాడిన సెల్‌ఫోన్‌ల డేటాను వెలికి తీశారు. మృతురాలు మరణంపై కేసుకు సంబంధించిన అన్ని రకాల సాక్ష్యధారాలు సేకరించి.. అన్ని పరిశీలించిన తర్వాత విచారణలో మెడికో ప్రీతిని డాక్టర్ ఎంఏ సైఫ్ ర్యాగింగ్ పేరుతో వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించాడని రుజువు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు. తాము సేకరించిన సాక్ష్యాధారాలతో కలిపి, 970 పేజీలతో కోర్టులో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. సైఫ్ వేధింపులే ప్రీతి మరణానికి కారణమని ఛార్జిషీట్‌లో పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ప్రీతి, సైఫ్ సెల్‌ఫోన్ ఛాటింగ్‌లను సైతం ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications