నా కూతురిది హత్యే.. గుండెలవిసేలా రోదిస్తున్న మెడికో ప్రీతి తల్లిదండ్రులు; శోకసంద్రంగా గిర్ని తండా!!

మా కూతురిది హత్యే అని మెడికో ప్రీతి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రీతి అంత్యక్రియలు నిర్వహించాల్సిన గిర్ని తండా విషాదంలో మునిగిపోయింది..

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో అనస్తీసియా మొదటి సంవత్సరం విద్యార్థిని ధారావత్ ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడి, ఐదు రోజుల ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడి చివరకు నిన్న రాత్రి మృతి చెందారు. దీంతో ప్రీతి మృతదేహం ఈరోజు ఆమె స్వగ్రామమైన జనగామ జిల్లా కొడకండ్ల కొడకండ్ల మండలంలోని ఆమె స్వగ్రామమైన గిర్ని తండాకు చేరుకుంది.

ప్రీతి స్వగ్రామంలో మిన్నంటుతున్న రోదనలు

ఈరోజు ఉదయం పోలీసు ఎస్కార్ట్ తో ఆమె స్వగ్రామానికిప్రీతి మృతదేహాన్ని తరలించగా ఊరు ఊరంతా ఒక్కసారిగా శోక సంద్రమైంది. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనకుండాగ్రామంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.ప్రీతి మృతదేహం వద్ద ఆమె తల్లిదండ్రులు తోబుట్టువులు, బంధువులు,రోధిస్తున్న తీరు పలువురిని కలిచిచేసింది.

ప్రీతి మృతి పట్ల గ్రామస్తుల ఆవేదన

ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం స్వగ్రామమైన కొడకండ్ల నుండి హైదరాబాద్ ఉప్పల్ కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రీతికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నాడు. ఇందులో ప్రీతి మూడవ సంతానం. చదువులో మొదటి నుండి చురుకైన విద్యార్థినిగా ఉన్న ప్రీతి ఇలా అర్ధాంతరంగా సీనియర్ వేధింపులు తట్టుకోలేక మృత్యువాత పడడంపట్ల గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుమార్తెది ఆత్మహత్య కాదు హత్యే .. తండ్రి కన్నీరు

తమ కుమార్తెది ఆత్మహత్య కాదు హత్యే .. తండ్రి కన్నీరు

ఎంతో సరదాగా ఉండే తమ కూతురు విగత జీవితగా పడి ఉండడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి మృతదేహాన్ని బలవంతంగా గిర్ని తండాకు తరలించారని, బోడుప్పల్ లోని తమ ఇంటికి తీసుకువెళ్తామన్న పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదు హత్య అంటూ తండ్రి నరేందర్ బోరున విలపిస్తున్నారు. ప్రీతి ఏం తీసుకుందో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు చేపట్టాలని, వేధింపులకు పాల్పడిన సైఫ్ ను ఉరి తీయాలని తండ్రి నరేందర్ డిమాండ్ చేశారు. తమ కుమార్తె ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేఎంసీ ప్రిన్సిపల్, హెచ్ ఓ డి లను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.

మధ్యాహ్నం అంత్యక్రియలు

మధ్యాహ్నం అంత్యక్రియలు

భవిష్యత్తులో ప్రీతీ మాదిరిగా మరే విద్యార్థికి ఇలాంటి ఇబ్బందులు రాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించి విద్యార్థులకు భరోసా కల్పించాలని గ్రామస్తులు సైతం డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రీతి అంతక్రియలు నిర్వహించనున్నారు . ప్రీతి మృతదేహాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల ఆక్రందనలతో గిర్ని తండా ప్రాంతం అంతా మారుమోగిపోతుంది. బరువెక్కిన హృదయాలతో అందరూ ప్రీతికి తుది వీడ్కోలు పలుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+