హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రియల్ స్టోరీ: వైద్య పరికరాలు లేకున్నా ప్రమాద బాధితుడిని కాపాడిన వైద్యులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ప్రాణాపాయం నుంచి సికింద్రాబాద్‌ అపోలో ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ ఫర్జా అంజుమ్, డాక్టర్ సావిత్రి దేవి కాపాడారు. అయితే ఇందులో వింతేముంది. డాక్టర్లు కాబట్టి మనుషుల ప్రాణాలను కాపాడటం వాళ్ల విధి అనుకుంటే పొరపాటు పడినట్లే.

వివరాల్లోకి వెళితే, సోమవారం రాత్రి ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎవరూ అతనికి సాయం చేసేందుకు ముందుకు రాలేదు. అంతేకాదు అతను ప్రాణపాయ స్థితిలో ఉంటే అక్కడికి చేరుకున్న వారంతా అతడిని సాయం చేయాల్సింది పోయి ఫోటోలు, వీడియోలు తీశారు.

ఇదే సమయంలో విధులను పూర్తి చేసుకుని అటుగా వస్తున్న ఇద్దరు డాక్టర్లు జనం అక్కడ గుమికూడి ఉండటాన్ని చూశారు. రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని తెలుసుకున్న డాక్టర్లు వెంటనే స్పందించి బాధితుడి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా వారివద్ద ఎటువంటి వైద్య పరికరాలు లేకపోయినా అతడిని కాపాడే ప్రయత్నం చేశారు.

Meet the Hyderabad doctors who saved an accident victim without medical instruments

బాధితుడి శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటే డాక్టర్ ఫర్జా వెంటనే తన వద్ద ఉన్న పెన్నుని తీసి నాలుక పట్టుకోని ఉంచింది. తన ఊపరితిత్తుల్లోకి గాలి వేళ్లేందుకు గాను ఆమె పక్కనే ఉన్న మరో డాక్టర్ సావిత్రి న్యూస్ పేపర్‌ను ఉపయోగించారు.

వారి వద్ద ఎటువంటి వైద్య పరికరాలు లేనప్పటికీ ఇలా సుమారు 20 నిమిషాల పాటు బాధితుడు శ్వాస తీసుకునే విధంగా ఇద్దరు డాక్టర్లు తమవంతు ప్రయత్నాలు చేశారు. చివరకు బాధితుడు తనంతట తానుగా శ్వాస పీల్చుకోవడంతో కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తర్వాత బాధితుడిని అంబులెన్స్‌లో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు ప్రస్తుతం కోలుకున్నాడని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో బాధితుడికి చికిత్స అందించి ప్రాణాప్రాయ స్థితి నుంచి తప్పించడంతో బాధితుడు ఇద్దరు డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపాడు.

English summary
Dr Faizah Anjum and Dr Savitri Devi are interns working at Secunderabad’s Apollo Hospitals. While returning from a trek on Monday night, they came across a road accident victim who had no one to help him. India’s Doctors reports how he was presumed dead by the crowd that had gathered around and were busy taking photographs and videos on their cellphones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X