Twitter Blue Tick: ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్..
టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో నిత్యం అప్ డేట్ ఇస్తుంటారు. అయితే వీరికి ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ ఉండడం వల్ల నిజమైన ఖాతాలుగా పరిగణించేవారు. అయితే తాజాగా ట్విట్టర్ టాలీవుడ్ ప్రముఖల ట్విట్టర్ బ్లూ టిక్(Twitter Blue Tick) తొలగించింది. బ్లూ టిక్ కోసం డబ్లు చెల్లించకపోవడంతో ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్ తొలగించారు. బ్లూ టిక్ కోల్పోయిన టాలీవుడ్ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహన్ బాబు, అల్లు అర్జున్, దగ్గుబాటి వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, అఖిల్, నితిన్, ప్రకాశ్ రాజ్, పూజా హెగ్డే, కీర్తి సురేష్స సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి, మంచు మనోజ్ ఉ్ననారు.
డబ్బులు చెల్లించడంతో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నట్లు తెలిసింది. అటు బాలీవుడ్ ప్రముఖులు కూడా బ్లూ టిక్ కోల్పోయారు. ఇందులో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆలియా భట్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా ఉన్నారు. అటు తమిళ స్టార్ రజినీకాంత్, విజయ్, శింబు లాంటి పెద్ద హీరోలకు సైతం బ్లూ టిక్ ను కోల్పోయారు. ట్విట్టర్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలంటే.. వెబ్ లో అయితే నెలకు రూ.650, మొబైల్ యాప్ లో అయితే రూ.900 చెల్లించాలి.

సినీ నటులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బ్లూ టిక్ కోల్పోయిన వారిలో ఉన్నారు. ట్విట్టర్ ను ఎలోన్ మస్క్ స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఇంతకుముందు బ్లూ టిక్ లు ఉన్నత స్థాయి వ్యక్తులు, పాత్రికేయులు, కార్యనిర్వాహకులు, రాజకీయ నాయకులు, సంస్థలకు వారి గుర్తింపులను ధృవీకరించిన తర్వాత ఇచ్చేవారు.
ఇప్పుడు డబ్బులు పే చేస్తే బ్లూ టిక్ ఇచ్చేస్తున్నారు. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం Twitterవినియోగదారులలో దాదాపు 1 శాతం మంది మాత్రమే "Twitter బ్లూ"కి సభ్యత్వాన్ని పొందారు. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్‌లు, వార్తా సంస్థలు, ఇతర "ప్రజా ప్రయోజనాల" ఖాతాలు నిజమైనవని గుర్తించడానికి కంపెనీ 2009లో బ్లూ టిక్ మార్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ధృవీకరణ కోసం కంపెనీ ఇంతకు ముందు ఎలాంటి డబ్బులు వసూలు చేయలేదు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ తీసుకొట్టారు. ప్రభుత్వ సంబంధిత ఖాతాల కోసం గ్రే టిక్ వెరిఫికేషన్ కేటాయిస్తున్నారు. కంపెనీలకు గోల్డెన్ టిక్ మార్క్ ను ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ వంటి రాజకీయ పార్టీల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ కూడా వారి ధృవీకరణ బ్యాడ్జ్‌లను కోల్పోయాయి.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications