వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుదైన సన్నివేశం: మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. అంతరిక్షంలో జరగబోయే ఓ అద్భుతం మీ కళ్ల ముందు ఆరోజు ఆవిష్కృతం కానుంది. 10 ఏళ్ల తర్వాత సూర్యుణ్ణి బుధ గ్రహం దాటివెళ్లే అరుదైన సన్నివేశం ఆకాశంలో చోటు చేసుకోనుంది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు చెన్నై బిల్లా ప్లానిటోరియంలో నాలుగు టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు.

అరుదైన సన్నివేశాన్ని మామాలు కళ్లతో చూడకూడదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బుధగ్రహం సూర్యుడిని ముందు నుంచి దాటివెళ్లే సన్నివేశం మే 9వ తేదీ సాయంత్రం 4.15 నుం చి 6.20 గంటల వరకు జరగనుంది. ఈ సమయంలో బుధగ్రహ వ్యాసం సూర్యుడికన్న చిన్నదిగా ఉండడంతో ఈ అరుదైన సన్నివేశం చిన్న చుక్కవలే కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సుమారు 7 గంటల పాటు ఈ అరుదైన సన్నివేశం భూమిపై నివసించే వారు వీక్షించొచ్చు. ఈ అరుదైన సంఘటనను ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీక్షించవచ్చు. మరోవైపు ఈ అరుదైన సంఘటన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పెన్స్ లాంటి దేశాల ప్రజలకు వీక్షించే అవకాశం లేకుండా పోయింది.

 మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట

మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట

అయితే మన దేశంలోని ప్రజలు సూర్యాస్తమయ సమయంలో ఈ సన్నివేశం చూడొచ్చు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా దేశాల్లో సూర్యోదయంలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకోవడం వారికి కలిసొచ్చింది. అందుకే వారు ఈ అరుదైన సంఘటనను వీక్షించొచ్చు.

 మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట

మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట

దేశంలో గత 1999 నవంబర్‌ 15వ తేదీ, 2003 మే 7వ తేదీ, 2006 నవంబర్‌ 8వ తేదీన ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మళ్లీ పదేళ్ల అనంతరం 9వ తేదీ చోటుచేసుకోనున్న ఈ అరుదైన దృశ్యాన్ని ఒట్టికళ్లతో వీక్షించకూడదని, కళ్లకు అద్దాలు పెట్టుకొని చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట

మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోందట

ఒక శతాబ్దానికి 8 సార్లు మాత్రమే బుధగ్రహం సూర్యుణ్ణి దాటి వెళుతుందని, 2019 నవంబర్‌ 11వ తేదీ మళ్లీ ఇటువంటి సన్నివేశం చూడవచ్చని వారు తెలిపారు.

అరుదైన సన్నివేశం: మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది

అరుదైన సన్నివేశం: మే 9న ఆకాశంలో అద్భుతం జరగబోతోంది


ఈ అరుదైన సంఘటనను ప్రజలు వీక్షించే విధంగా కెనడాలోని ఒట్టావా సెంటర్‌ ఆఫ్ ద రాయల్ ఆస్ట్రానోమికల్ సొసైటీ వారు ప్రత్యేకంగా టెలిస్కోపులను సిద్ధం చేశారు.

English summary
On Monday (May 9), you will have an opportunity to witness one of the rarest astronomical events: a transit of Mercury across the face of the sun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X