జిఎస్టీ డైలాగ్ లేకుండా తెలుగులో హీరో విజయ్ 'అదిరింది' సినిమా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: మెర్సెల్ చిత్రం తెలుగు వర్షన్‌లో జీఎస్టీ పైన ఉన్న డైలాగ్స్ తొలగించనున్నారు. అదిరింది పేరుతో ఈ సినిమా తెలుగు వర్షన్ విడుదల కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో దర్శకులు మాట్లాడారు. తెలుగు వర్షన్‌లో జిఎస్టీ డైలాగ్స్ తొలగిస్తున్నట్లు చెప్పారు. అంటే ఆ డైలాగ్ వచ్చినప్పుడు బీఫ్ సౌండ్ పెట్టనున్నారు. కాగా, తమిళ నటుడు విజయ్ నటించిన మెర్సెల్ చిత్రంలో జీఎస్టీ పైన డైలాగ్స్ ఉన్నాయి.

Mersal Telugu version: filmmakers mute anti GST dialogue

ఇవి తమిళనాట వివాదానికి తెరలేపాయి. జీఎస్టీపై సినిమాలో వ్యతిరేక వ్యాఖ్యలు బిజెపి ఆగ్రహానికి గురయ్యాయి. సింగపూర్ వంటి దేశాల్లో జీఎస్టీ తక్కువ ఉందని, కానీ అక్కడ వైద్యం ఉచితం అని, మన వద్ద జీఎస్టీ ఎక్కువగా ఉన్నా ఉచితం లేదని విమర్శించారు.

దీనికి బిజెపి కూడా ఘాటుగానే స్పందించింది. తెలుసుకొని మాట్లాడాలని చెప్పింది. సింగపూర్‌లో ప్రతి ఒక్కరు తమ ఆదాయంలో పది శాతం డిపాజిట్ చేయాలని, ఆ విషయం తెలుసుకోవాలని బిజెపి కౌంటర్ ఇచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that, Amid all the controversy surrounding Vijay starrer Mersal, the GST dialogue in the Telugu version has been muted by the filmmakers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి