Rains: సోమవారం నుంచి హైదరాబాద్‍లో వర్షాలు..!
వచ్చే మూడు రోజులు హైదరాబాద్ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా వానలు పడతాయని పేర్కొంది. సోమవారం నుంచి మూడ్రోజులు పాటు భారీ వర్షాలుంటాయని వివరించింది. సిటీకి సోమవారం ఎల్లో అలర్ట్, మంగళ, బుధవారాల్లో అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల క్రితం కురిసిన వర్షంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయయ్యాయి.
ఇప్పుడు మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణం శాఖ హెచ్చరించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల వల్ల హైదరాబాద్ వాసులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. భారీ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరారు.

లాంటి సమస్య వచ్చినా బల్దియా ఏర్పాటు చేసిన 428 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సమాచారం ఇవ్వాలని కోరారు. సిటీలో 27 డీఆర్ఎఫ్ టీమ్స్ సైతం 24 గంటల పాటు పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే వర్షకాలం వచ్చే వ్యాధులుపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారుకు సూచించారు. ఈ సమయంలో దోమలు బాగా పెరిగి డెంగీ జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
శిథిలావస్థ భవనాల్లో ఉన్నవారిని వెంటనే సురక్షిత ప్రాంతాలు తరలించారలని సూచించారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం పెరిగింది. సోమవారం నుంచి వర్షాలు కురిసే నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాలను అప్రమత్తు చేశారు. సిటీలో వాటర్ లాగింగ్స్ క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications