Rains: అల్పపీడనం.. తెలంగాణలో వచ్చే రెండు రోజులు వర్షాలు..
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది. ఇందుకు సంబంధించి పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వచ్చే రెండు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ములుగు, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వానలు పడే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఇక హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ 21వ తేదీన సాయంత్రం, రాత్రి సమయాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేశారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కోంది. ఈ అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలకు ఆనుకుని కొనసాగుతున్నట్లు వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్లు చెప్పింది. ఆవర్తనం సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని వెల్లడించింది.

రెండు రోజుల్లో ఇది వాయవ్య దిశగా కదిలి జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం అందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 24 అల్పపీడనం కదిలే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇప్పటికే తెలంగాణలో కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. గురువారం తెల్లవారుజామున తేలిపాటి వర్షం కురిసింది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో వాతావరణం మేఘావృతమై ఉంది. అయితే గత కొద్ధి రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా.. గురువారం టెంపరేచర్ తగ్గింది.
అటు ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్తాన్‌లోని జైసల్మేర్ నుంచి అల్పపీడన ప్రాంతం వరకు కొనసాగుతోందని వివరించింది. ఏపీ మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న రెండు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో అనేక చోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications