Weather Update: రైతులకు షాక్.. జులైలో కూడా ఇంతేనా..!
రైతులకు శుభవార్త.. రాష్ట్రంలో ముందుగానే ప్రవేశించిన రుతుపవనాలు.. ఇక భారీ వర్షాలు.. అని అన్నారు. కానీ రుతుపవనాలు వచ్చి 20 రోజులు దాటినా సరైన వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు కురిసినా తేలిపాటి వానలే వచ్చాయి. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో వరి సాగు చేయాలంటే.. వర్షాలు అవసరం. ఒకవేళ వర్షాలు కురువకపోతే వరి సాగు తగ్గే అవకాశం ఉంది. జూన్ నిరాశపరిచినా.. జులైలో వర్షాలు కురిస్తాయని అందరు భావిస్తున్నారు.
అయితే వాతావరణ అధికారులు మాత్రం షాకింగ్ విషయం చెబుతున్నారు. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదలడం లేదని పేర్కొంటున్నారు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడన లేకపోవడంతో రుతుపవనాలు బలహీనపడినట్లు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు, ద్రోణులు వస్తే రుతుపవనాలు బలపడి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

పశ్చిమ గాలుల ప్రభావం వల్లే అక్కడ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. తెలంగాణలోకి ఈ నెల 4న రుతుపవనాలు వచ్చాయి. ఆరు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 10 నుంచి మధ్య భారతంలో విస్తరిస్తున్న రుతుపవనాల చురుకుదనం తగ్గింది. ఇప్పుడు నెమ్మదిగా కదులుతున్నట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్, బిహార్ లో రుతుపవనాలు విస్తరించాల్సి ఉంది.
కానీ అవి నెమ్మదిగా కదులుతుండడంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. రుతుపవనాల విస్తరణకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జులై వర్షాలు కురవకపోతే రాష్ట్రంలో కరుపు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలోని ప్రాజెక్టులు దాదాపు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే తీవ్ర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. శ్రీశైలంలో 215 టీఎంసీలకుగాను 36 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. సాగర్ ప్రాజెక్ట్‌లో 312 టీఎంసీలకుగాను 122 టీఎంసీలే ఉన్నాయి. ఇక శ్రీరాం సాగర్ కూడా నీటి మట్టం భారీగా పడిపోయింది.












Click it and Unblock the Notifications