హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలు దొంగలు దొరికారు: వారిద్దరు ఇలా..

హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌లో ఉద్యోగాలంటూ అమాయకులను మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు, అతని సహకరిస్తున్న నిందితురాలిని తెలంగాణలోని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

Mero Rail Project Jobs Cheaters Are Arrested మెట్రో రైలు దొంగలు దొరికారు..| Oneindia Telugu

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌లో ఉద్యోగాలంటూ అమాయకులను మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు, అతని సహకరిస్తున్న నిందితురాలిని తెలంగాణలోని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ మహేష్ భగవత్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్ మెట్రో రైల్ విభాగంలో వివిధ క్యాటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయంటూ నాగోల్‌కు చెందిన పి.శ్రీకాంత్ వాట్సాఫ్‌కు ఒక మేసేజ్ వచ్చింది. అందులో నెంబర్‌కు ఫోన్ చేసి తన సోదరికి ఉద్యోగం కావాలన్నాడు. అన్ని సర్టిఫికెట్లతో పాటు రూ. 2 లక్షలు కావాలని సైబర్‌ఛీటర్లు సూచించగా అతను వారు సూచించిన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేశారు.

ఆ తర్వాత సైబర్ ఛీటర్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చా యి. దీంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో పోలీసులు ఒరిస్సాకు చెందిన రాకేష్ పాట్రో, అతనికి బ్యాంకు ఖాతాలిస్తూ సహకరిస్తున్న కృష్ణకవితలను నాగపూర్‌లో అరెస్ట్ చేసి నగరానికి తరలించారు.

పది లక్షల దాకా వసూలు

పది లక్షల దాకా వసూలు

పలువురి నుంచి నిందితులు రూ. 9.75 లక్షలు వసూలు చేయగా, విచారణలో మల్కాజిరిగి ప్రాంతంలో 8 మంది బాధితుల నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేసినట్లు తేలింది. మెట్రో ఉద్యోగాల పేరుతో ఈ ముఠా సుమారు రూ. 20 లక్షలకు పైగానే చీటింగ్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

ఇలా సంప్రదించాడు....

ఇలా సంప్రదించాడు....

హైదరాబాదులోని నాగోల్‌కు చెందిన శ్రీకాంత్‌ (32) చరవాణికి గత మార్చిలో గుర్తుతెలియని వ్యక్తి వాట్సప్‌ కాల్‌ చేశాడు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)లో ఉద్యోగాలు కావాలా అని అడిగాడు. తన సోదరి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందని శ్రీకాంత్‌ చెప్పాడు. అర్హత ఉంటే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన ఆగంతుకుడు మెయిల్‌లో ధ్రువపత్రాలు పంపించాలని సూచించాడు. మెట్రో రైల్‌లో టికెట్‌ కలెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో నమ్మి రూ.2 లక్షలను ఆగంతుకుడు సూచించిన బ్యాంకు ఖాతాలో వేశాడు. తనతోపాటు మరికొందరికి ఉద్యోగాలు ఇప్పించాలని బాధితురాలు కోరడంతో అతను అంగీకరించాడు. దీంతో మరో రూ.7.75 లక్షల్ని అతని ఖాతాలో డిపాజిట్‌ చేశారు.

మాక్ ఇంటర్వ్యూలు కూడా చేశాడు...

మాక్ ఇంటర్వ్యూలు కూడా చేశాడు...

కొద్దిరోజుల తర్వాత ఆగంతుకుడు ఫోన్‌లోనే బాధితులకు మాక్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాడు. త్వరలోనే నియామక పత్రాలు అందుతాయని నమ్మించాడు. సమయం గడుస్తున్నా పత్రాలు రాకపోవడంతో బాధితులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. అయితే, అతను స్పందించడం మానేశారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. ఇన్‌స్పెక్టర్లు రియాజుద్దీన్‌, హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసుల బృందం దర్యాప్తు చేసి ఆగంతుకుడు మహారాష్ట్ర నాగ్‌పుర్‌ నుంచి మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి ఆరా తీయగా ప్రధాన నిందితుడు ఒడిశా సంబల్‌పూర్‌కు చెందిన రాకేశ్‌ పాత్రో (43)గా తేలింది. నాగ్‌పుర్‌లో ఉంటున్న అతడు ఒడిశాకే చెందిన కృష్ణ కవిత (34) అనే మహిళ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు వేయించుకున్నట్లు తేలింది.

మల్కాజిగిరిలోనూ...

మల్కాజిగిరిలోనూ...

రాకేశ్‌ గతంలో ఎల్‌అండ్‌టీ సంస్థలో పనిచేశాడు. దీంతో ఉద్యోగ నియామకాలు ఎలా జరుగుతాయో అతనికి తెలుసు. దాంతో ఈ మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. గురువారం నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి టాటా బోల్ట్‌ కారు, మూడు మొబైల్స్, రాకేశ్‌ పేరిట ఉన్న రెండు పాన్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణ క్రమంలో ఈ నిందితులే గతంలో మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన 8 మంది నుంచి ఉద్యోగాలిప్పిస్తామని రూ.10 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఈ కేసులో ప్రస్తుతం వీరు విచారణను ఎదుర్కొంటున్నారు.

English summary
Two persons, Rakesh and Kavitha arrested fr cheating on the name of jobs in Mero rail project of Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X