Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాతబస్తీలో మెట్రో నిర్మాణం.. హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్ పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ తన పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలకు నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా కోర్టుకు స్పష్టం చేశారు. చారిత్రక కట్టడాలను కూల్చడం లేదని తెలిపారు.

Metro construction in Old Town High Court issues key orders on historical buildings

పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడతామని, దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏఏజీ హైకోర్టును కోరారు. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం స్పందించింది. మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా చారిత్రక కట్డడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని సూచించింది.

పురావస్తు శాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు చేపట్టకూడదని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఏప్రిల్ 22 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక, పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

ఇది ఇలావుండగా, హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మెట్రో రైలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నష్టాలు చవిచూస్తుండటంతో ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2017 నవంబర్ నుంచి దశలవారీగా మెట్రో రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్నుంచి గత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మెట్రో రైలు నష్టాలు రూ. 6500 కోట్లకు చేరాయని ఎల్ అండ్ టీ సంస్థ పేర్కొంది.

స్టేషన్లు, మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజ్, ప్రకటనలతో ఆదాయ మార్గాలను మెరుగుపర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నా.. నష్టాలు భరించలేని స్థాయికి చేరాయని పేర్కొంది. ఈ క్రమంలోనే మెట్రో రైలు ఛార్జీలను పెంచక తప్పడం లేదని సంస్థ చెబుతోంది. కాగా, ఇటీవల బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44 శాతం పెంచడంతో తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా రైలు ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+