హైదరాబాదీలకు ఎగిరి గంతేసే శుభవార్త చెప్పిన మెట్రో రైల్!
ప్రయాణికులకు మెట్రో తన సేవలను అందించటమే కాకుండా ప్రయాణికుల ఇబ్బందులను తీర్చే మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికులు స్టేషన్ నుండి తమ గమ్య స్థానాలకు చేరుకునే ప్లాన్ ను చేస్తుంది. సులభంగా ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేలా కాలుష్య రహిత వాహనాలను మెట్రో స్టేషన్ తో అనుసంధానం చేసింది.
హైదరాబాద్ మెట్రో కొత్త ఆలోచన
దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణాలు చేసేవారు తమ ఇళ్ళు, కార్యాలయాలు, కళాశాలలకు వెళ్లేవారు తమ సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేకుండా మెట్రో రవాణా వ్యవస్థను తీసుకురావడానికి రెడీ అయింది. దేశంలో ఢిల్లీ తర్వాత అతిపెద్ద రవాణా వ్యవస్థ హైదరాబాద్ మెట్రో వ్యవస్థ. హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ లో ఉన్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సేవలను అందిస్తూ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈవీ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్న మెట్రో
అయితే మెట్రో రైల్ లో ప్రయాణించే వారు స్టేషన్లోకి వెళ్లడానికి, స్టేషన్ల నుంచి ఇంటికి వెళ్లడానికి సొంత వాహనాలు, క్యాబ్ లు, ఆటోలు, టూ వీలర్స్ వినియోగిస్తున్నారు. ఒక్కోసారి ట్రాఫిక్ సమస్యల కారణంగా వారు సమయానికి చేరుకోవడం లేదు. ఈ సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా హైదరాబాద్ మెట్రో అడుగులు వేస్తోంది. హైదరాబాద్ మెట్రో ఫస్ట్ లాస్ట్ కనెక్టివిటీల వద్ద ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
ఈవీ వాహనాలకు మహిళలకు శిక్షణ
ఇక ఈ ఈవీ వాహనాలను నడపడానికి మహిళలకు శిక్షణ ఇచ్చి వారికి మెలకువలు నేర్పిస్తున్నారు. ప్రస్తుతం ఐదుగురు మహిళలకు శిక్షణను ఇచ్చిన మెట్రో భవిష్యత్తులో 100 మంది వరకు శిక్షణ ఇచ్చి వారిని ప్రయాణికుల సౌకర్యం రంగంలోకి దింపనన్నారు. తద్వారా మహిళలకు ఉపాధి కల్పించటం మాత్రమే కాకుండా, ప్రయాణికులకు ట్రావెల్ కష్టాలను తీర్చనున్నారు.
హైదరాబాదీ లకు శుభవార్త
వీరు నేరుగా ఇళ్ల నుండి, కార్యాలయాలనుండి కళాశాలలకు వెళ్లే వారికి ఈవీ వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి దొరకడమే కాకుండా ప్రతినిత్యం మెట్రోలో ప్రయాణించే వారికి అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనా ప్రయాణికుల కోసం మెట్రో తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే హైదరాబాదీలకు ఎగిరి గంతేసే వార్త.












Click it and Unblock the Notifications