వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వలస కూలీలకు కేసీఆర్ భరోసా: 40 ప్రత్యేక రైళ్లలో తరలింపు, ఆందోళన చెందొద్దని పిలుపు

|
Google Oneindia TeluguNews

సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వలస కూలీలు ఆందోళన చెందుతుంటే సీఎం కేసీఆర్ అభయహస్తం ఇచ్చారు. కూలీలను సొంత రాష్ట్రానికి తరలిస్తామని, ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. వారిని స్వస్థలాలకు తరలించే బాధ్యత సీనియర్ ఐఏఎస్ సందీప్ సుల్తానియా, జితేందర్ రెడ్డిలకు అప్పగించారు. ప్రత్యేక రైళ్లలో కూలీలను గమ్యస్థానాలకు చేరుస్తామని.. ఫికర్ చేయొద్దని కోరారు.

 migrant labourers will be departure native places: kcr

లాక్ డౌన్ పొడగింపుతో వలసకూలీల ఆందోళన పీక్ స్టేజీకి చేరింది. సొంత రాష్ట్రానికి వెళ్లనీయాలని దేశంలో చాలాచోట్ల కూలీలు నిరసనకు దిగారు. ఇటీవల సంగారెడ్డి లో గల కంది వద్ద కూడా కూలీలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న కూలీలను ప్రత్యేక రైళ్లతో సొంత రాష్ట్రానికి పంపిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. వారం రోజులపాటు 40 చొప్పున ప్రత్యేక రైళ్లలో కార్మికులను తరలిస్తామని.. ఆందోళన చెందొద్దని సూచించారు.

Recommended Video

Women Waiting In Queue In Front Of Wine Shops , Pics Viral

హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు బయల్దేరతాయని చెప్పారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ వరకు రైళ్లు వెళతాయని చెప్పారు. కూలీలను గమ్యస్థానాలకు చేరుస్తాయని.. ఎలాంటి బెంగ పెట్టుకోవద్దని కోరారు.

English summary
migrant labourers will be departure their native places telangana cm kcr said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X