హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలిసారే కానీ.: డబ్ల్యూటీసీలో అసదుద్దీన్ తెలుగు స్పీచ్ అదుర్స్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రపంచ తెలుగు మహాసభలు : అసదుద్దీన్ తెలుగు స్పీచ్ అదుర్స్ ! ప్రత్యేక ఆకర్షణ

హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల్లో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఏ వేదికపై కూడా తెలుగులో మాట్లాడని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తొలిసారిగా పూర్తిగా తెలుగులోనేగా ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ ఎల్‌బీ మైదానంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్‌, కేటీ రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, కేశవరావు, అసదుద్దీన్‌ ఒవైసీ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు, కళాకారులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.

ఆద్యంతం తెలుగులోనే..

ఆద్యంతం తెలుగులోనే..

‘సభకు విచ్చేసిన ప్రముఖులకు నా హృదయపూర్వక నమస్కారములు, ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు' అంటూ ఆద్యంతం తెలుగులోనే మాట్లాడారు ఓవైసీ. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించడం సంతోషదాయకమని, తెలుగు భాషాభివృద్ధికోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని ఓవైసీ ప్రశంసించారు.

పాలు, నీళ్లలా కలిసిపోయారు..

పాలు, నీళ్లలా కలిసిపోయారు..

కుతుబ్‌షాహీ కాలంనుంచి హిందూముస్లింలు ఐకమత్యంతో జీవిస్తున్నారని, పాలు నీళ్లలా కలిసిపోయారని చెప్పిన ఓవైసీ.. సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని, ఇండస్ట్రియల్, ఐటీ, ఇతర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు.

ప్రపంచంలోనే లేదు..

ప్రపంచంలోనే లేదు..

‘పాతనగరంలో నివాసం ఉంటున్న షరీఫ్ ఉర్దూలోని ఖురాన్‌ను తెలుగులోకి అనువదించాడని, గఫూర్ అనే రచయిత తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించి తెలుగు భాష సేవచేశాడని ఓవైసీ తెలిపారు. దేశంలో నేను దక్షిణ భారతీయుడిని, తెలంగాణలో తెలంగాణ వాదిని, హైదరాబాద్‌లో ఉర్దూ మాట్లాడే హైదరాబావాదీని.. ఈ ప్రపంచంమొత్తంలో మనదేశం వంటి దేశంలేదు' అంటూ ఓవైసీ ఆకట్టుకున్నారు.
దేశంలోని అన్ని భాషలు, సంస్కృతులు వేరయినా వాటిని పరిరక్షించుకునేందుకు మనం కృషి చేయాలి అని పేర్కొన్నారు.

శోభన్‌బాబు సినిమా, పూతరేకులంటే తెలీదు: కేసీఆర్ స్పీచ్ అద్భుతం శోభన్‌బాబు సినిమా, పూతరేకులంటే తెలీదు: కేసీఆర్ స్పీచ్ అద్భుతం

మన్నించాలి.. ప్రత్యేక ఆకర్షణగా ఓవైసీ స్పీచ్

మన్నించాలి.. ప్రత్యేక ఆకర్షణగా ఓవైసీ స్పీచ్

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దాదాపు ఏనాడూ లేని విధంగా తెలుగులో మాట్లాడిన ఓవైసీ.. ఉర్దూ, తెలుగు భాషలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కుతుబ్‌షాహీల కాలం నుంచే తెలంగాణ.. హిందూ-ముస్లింల ఐక్యతకు ఉదాహరణగా నిలిచిందని గుర్తుచేశారు. తొలిసారి తెలుగులో ప్రసంగించిన అసదుద్దీన్‌ ఓవైసీ.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేశారు. కాగా, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తెలుగులో చేసిన ప్రసంగం ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

English summary
MP and All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) president Asaduddin Owaisi spoke in Telugu at the inaugural ceremony of the World Telugu Conference on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X