నన్ను చంపటానికి ప్రయత్నిస్తున్నారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఎంఐఎం నేతల అరెస్ట్, రిమాండ్!!

నిన్న నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎంఐఎం కౌన్సిలర్లు, కార్యకర్తలు పట్టణ ప్రగతి ఎక్కడ జరిగిందో చూపించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘర్షణ కు దిగిన విషయం తెలిసిందే. అంతేకాదు ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ను సైతం వారు టార్గెట్ చేశారు.

రెంజల్ బేస్, రాకాసి పేట కాలనీల్లో పట్టణ ప్రగతి లో పాల్గొన్న ఎం.ఎల్.ఏ. షకీల్ ను నిన్న ఎం.ఐ.ఎం. కౌన్సిలర్లు అడ్డుకున్నారు. తనను అడ్డుకున్న సమయంలో వారి వద్ద మారణాయుధాలు కనిపించాయని ఎమ్మెల్యే షకీల్ పోలీసులను ఆశ్రయించారు. బోధన్ ఎంఐఎం కౌన్సిలర్స్, కార్యకర్తలపై ఎమ్మెల్యే షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

MIM leaders arrested and remanded on complaint of BRS Bodhan MLA Shakeel

ఎంఐఎం కౌన్సిలర్లు, కార్యకర్తలు తనను చంపటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కారుని అడ్డుకుని గ్రూప్ గా ఏర్పడి మారణాయుధాలతో చంపటానికి వచ్చారని పేర్కొన్నారు. ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎంఐఎం కౌన్సిలర్లు అల్తాఫ్, నావిధ్, మరో 8 మంది కార్యకర్తలపై 307,324,341,R/W 34 IPC సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

వారిని అరెస్ట్ చేసి జడ్జి ముందు హాజరు పరిచారు. జడ్జి గారికి ఈనెల 30వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అయితే తమపై అనవసరంగా అక్రమ కేసులు పెడుతున్నారని ఎంఐఎం కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో ఎంఐఎం కార్యకర్తలు జడ్జి ముందుకు చేరుకున్నారు. నిజామాబాద్ లో ఎంఐఎం కౌన్సిలర్ లకు రిమాండ్ విధించారు.

ఇక తాజా పరిణామాలతో బోధన్ లో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ నేతల మధ్య దూరం పెరుగుతుంది. ఇక ఈ విషయాన్ని ఎంఐఎం నేతలు అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ క్రమంలో రేపు అసదుద్దీన్ ఓవైసీ బోధన్ వెళ్లనున్నారు. ఈ పరిణామాలతో ముందు ముందు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+