అతడి నిర్ణయంమీద ఆధారపడ్డ BJP, BRS?

అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెడుతున్న ఎంఐఎం తెలంగాణలో ఏం చేయబోతోంది.

భారత రాష్ట్ర సమితిగా పేరుమార్చుకున్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో మొదటి నుంచి ఎంఐఎం స్నేహ హస్తాన్ని అందిస్తోంది. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భారతీయ జనతాపార్టీ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తన ప్రతి సభలోను ఆ పార్టీ అనుసరిస్తోన్న విధానాలు, తీసుకొస్తున్న నిబంధనలు.. తదితరాలను తెలంగాణ పాలనతో పోల్చిచూపుతూ ధ్వజమెత్తుతున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎంఐఎం

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎంఐఎం


వచ్చే తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అధికారంలోకి రావాలనుకుంటోంది బీజేపీ. దీనికోసం ఆ పార్టీ ఇప్పటికే వ్యూహాన్ని రూపొందించుకొని కార్యాచరణ ప్రణాళికకు ఉపక్రమించింది. తెలంగాణలో విజయం సాధిస్తే ఏపీలో కూడా సులువుగా అధికారంలోకి రావచ్చనే ప్రణాళిక కూడా బీజేపీకి ఉంది. అయితే బీజేపీతో పోరును జాతీయస్థాయికి తీసుకెళ్లిన కేసీఆర్ ఎంతవరకు విజయవంతమవుతారా? అనే సందేహాన్ని సీనియర్ రాజకీయవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఇప్పటికే ప్రజల్లో ఉన్న పార్టీ అని, తెలంగాణ మినహా ఇతర రాష్ట్రాలన్నింటిలోను బీఆర్ఎస్ ను కొత్తగా పరిచేయం చేయాల్సి వస్తోందని, ఇదే ఆ పార్టీకి మైనస్ గా మారిందని విశ్లేషిస్తున్నారు.

అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బరిలోకి..

అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బరిలోకి..

ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హైదరాబాద్ కు చెందిన ఎంఐఎం పోటీకి దిగుతోంది. 2014 వరకు హైదరాబాద్ కే పరిమితమైన ఆ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో పోటీకి దిగుతోంది. దీనివల్ల మైనార్టీల ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి బీజేపీకి భారీగా లబ్ధి చేకూరుతోంది. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తరుచుగా ప్రస్తావిస్తుంటారు. పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే ఎంఐఎం పోటీచేస్తోందని, ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో బెంగాల్ లోని 30 శాతం మైనార్టీలంతా గుంపగుత్తగా మమతావైపే మొగ్గుచూపారు.

బీజేపీకి మేలు జరగాలనా?

బీజేపీకి మేలు జరగాలనా?

భారత రాజకీయాల్లో బీజేపీకి లాభం కలిగించే ఉద్దేశంతోనే ఎంఐఎం రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తుందనేది నిర్వివాదాంశం. ఎంఐఎం త్వరలోనే జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తే కేసీఆర్ కు లాభం కలుగుతుందికానీ బీజేపీ కలగదు అనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎంఐఎం పోటీవల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారీగా చీలిపోతుందని, మైనార్టీ ఓట్లను ప్రభావితం చేయగలిగితే బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతుందంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి దాటి ఇతర జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పోటీచేస్తే మైనారిటీల ఓట్లను దక్కించుకోవచ్చు. వాస్తవానికి ఈ ఓటింగ్ బీఆర్ఎస్ వైపు ఉంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో పోటీచేసి వీలైనన్ని ఎక్కువ స్థానాలు సాధిస్తామని అసెంబ్లీలోనే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతాచోట్ల పోటీచేస్తే బీఆర్ఎస్ కు లాభమా? నష్టమా? అనే చర్చ నడుస్తోంది. అలాగే దీదీ ఆరోపిస్తున్నట్లుగా తెలంగాణ ఎన్నికల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి పరోక్ష లాభం కలిగేలా వ్యవహరిస్తుందా? అనేది కొద్దిరోజులు వేచిచూస్తేకానీ ఒక స్పష్టత రాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+