పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మంత్రి

తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు శనివారం జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం మారుతీ నగర్ వద్ద పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. జాతీయ రహదారిపై మంత్రి ప్రయాణిస్తుండగా, ఆయన కారును మరో కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు టైరు ఊడిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. కారు స్వల్పంగా దెబ్బతినగా, ప్రమాదం జరిగిన వెంటనే ఆయన మరో వాహనంలో తన నివాసానికి చేరుకున్నారు.

Minister Adluri Laxman survived a major accident

అడ్లూరి లక్ష్మణ్ కొద్ది రోజుల క్రితమే తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు అవకాశం లభించిన ముగ్గురు మంత్రులలో ఈయన ఒకరు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+