వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను రైతులు నమ్మొద్దు: తెలంగాణా భూముల విలువపైనా మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వరంగల్ జిల్లాలో నిర్వహించిన వానాకాలం సాగు సన్నాహక సమీక్ష సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులపై కుట్రలు చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలను రైతులు ఎవరూ నమ్మొద్దు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. కొన్ని పార్టీలు రైతులను మభ్యపెట్టే హామీలు ఇస్తున్నాయని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

సీఎం కెసిఆర్ 3 వేల కోట్ల నష్టం వస్తున్నా సరే, వడ్లు కొనుగోలు చేస్తున్నారు

సీఎం కెసిఆర్ 3 వేల కోట్ల నష్టం వస్తున్నా సరే, వడ్లు కొనుగోలు చేస్తున్నారు

సీఎం కెసిఆర్ ఆదేశానుసారం ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం అని పేర్కొన్న మంత్రి ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? అనేది చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. గతంలో కొందరు వరి విషయంలో రైతులను మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనని చెప్పినా కావాలని కొందరు రైతులతో వరిని సాగు చేయించారని, చివరకు సీఎం కెసిఆర్ 3 వేల కోట్ల నష్టం వస్తున్నా సరే, మళ్ళీ వడ్లు కొనుగోలు చేస్తున్నారు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రైతులను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఎప్పుడు ఉంటారని, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులు మభ్యపెట్టేందుకే

కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులు మభ్యపెట్టేందుకే


రైతుల కోసం మాట్లాడే పార్టీ ఏదైనా ఉందా అని ప్రశ్నించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వాళ్లు పాలించే రాష్ట్రాల్లో అమలు చేయలేని హామీ తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.

తనకు నచ్చిన సీఎంలు ఇద్దరే...

తనకు నచ్చిన సీఎంలు ఇద్దరే...

తనకు నచ్చిన ముఖ్యమంత్రులు ఇద్దరే ఇద్దరు అని ఒకరు సీనియర్ ఎన్టీఆర్ కాగా ఇంకొకరు సీఎం కేసీఆర్ అంటూ మంత్రి ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. రైతులకు ఎటువంటి కష్టాలు లేకుండా చేసిన మహానుభావుడు సీఎం కెసిఆర్ అంటూ కితాబిచ్చారు. రైతుల కోసం ఇన్ని సదుపాయాలు కల్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించిన మంత్రి ఎర్రబెల్లి రైతులను లాభసాటి సాగుపై ముందుగానే ముందుచూపుతో సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ లాభసాటిగా ఉంది. దిగుబడి ఎక్కువ, పెట్టుబడి తక్కువ అంటూ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.

తెలంగాణాలో ప్రస్తుతం భూముల విలువ.. వ్యవసాయ పరిస్థితులకు నిదర్శనం

తెలంగాణాలో ప్రస్తుతం భూముల విలువ.. వ్యవసాయ పరిస్థితులకు నిదర్శనం

తెలంగాణా రాష్ట్రంలో గత 8 ఏండ్లలో భూముల విలువలు ఎంత ఉన్నాయి.. ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, ఇదొక్కటే ఇవ్వాల్టి రైతుల, వ్యవసాయ పరిస్థితులకు నిదర్శనం అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన వారు లాభాలు పొందారని పేర్కొన్నారు. ఏ పంట వేస్తే లాభం దొరుకుతుందో ఆలోచించి సాగు చేయాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశంలో వెల్లడించారు.

English summary
Minister Errabelli Dayakar Rao said that the farmers did not believe in the conspiracies of the BJP and the Congress. Minister Errabelli also commented on the value of Telangana lands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X