Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అలాంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు..యుద్ధప్రాతిపదికన ఆక్సిజన్ ఏర్పాట్లు...ఒక్క పేషెంట్ కూడా అలా చనిపోవద్దని: ఈటల

రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించట్లేదన్న కారణంతో కొన్ని ఆస్పత్రులు మృతదేహాలను కూడా ఇవ్వట్లేదన్నారు. మానవతా దృక్పథంతో వ్యహరించాల్సిన సమయంలో వ్యాపార కోణంలో వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజులు వసూలు చేయాలని సూచించారు. సాధారణ బెడ్లకు రోజుకు రూ.4వేలు,ఐసీయూ బెడ్లకు రోజుకు రూ.7500,వెంటిలేటర్ బెడ్‌కు రూ.9వేలు మాత్రమే వసూలు చేయాలన్నారు.

ముందు జాగ్రత్త... రోజుకు 400 టన్నుల ఆక్సిజన్...

ముందు జాగ్రత్త... రోజుకు 400 టన్నుల ఆక్సిజన్...

తెలంగాణలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని... అన్ని జిల్లాలకు ఆక్సిజన్ సప్లై చేస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్‌ను సరఫరా చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఆక్సిజన్ సరఫరా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రోజుకు 270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుందని... ముందు జాగ్రత్తలో భాగంగా రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు...

జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు...

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆక్సిజన్ కోసం ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడట్లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క కరోనా పేషెంట్ కూడా ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింత పెరిగినా... అందుకు అనుగుణంగా ఆక్సిజన్ సప్లై ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

నిమ్స్‌లో ఆ బ్లాక్ ఇక కోవిడ్ సేవలకు...

నిమ్స్‌లో ఆ బ్లాక్ ఇక కోవిడ్ సేవలకు...

పీఎం కేర్స్ నుంచి ఇప్పటికే రాష్ట్రానికి ఐదు ఆక్సిజన్ మెషీన్లు వచ్చాయని తెలిపారు. బుధవారం(ఏప్రిల్ 27) నుంచి నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో కోవిడ్ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. అక్కడ ఆక్సిజన్ సపోర్ట్‌తో కూడిన 350 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో ప్రస్తుతం సాధారణ రోగులకు చికిత్స అందిస్తున్న బ్లాక్‌ను పూర్తిగా కోవిడ్ బాధితులకు కేటాయించినట్లు చెప్పారు. బుధవారం నుంచి ఆ బ్లాక్‌లోని మొత్తం 200 బెడ్లు కోవిడ్ పేషెంట్లకు కేటాయించనున్నట్లు తెలిపారు.

యుద్ధప్రాతిపదికన మరో 3010 ఆక్సిజన్ పడకలు...

యుద్ధప్రాతిపదికన మరో 3010 ఆక్సిజన్ పడకలు...

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 10వేల ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని ఈటల రాజేందర్ వెల్లడించారు. ఒక్క సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోనే 600 ఐసీయూ పడకలు ఉన్నాయని... దేశంలో ఇన్ని ఐసీయూ పడకలు నిర్వహిస్తున్న ఏకైక ఆస్పత్రి గాంధీ ఒక్కటేనని తెలిపారు. గాంధీలో మరో 400 పడకలకు ఆక్సిజన్ లైన్స్ వేయాలని నిర్ణయించామన్నారు. గచ్చిబౌలి టిమ్స్‌లో 300,వరంగల్ ఎంజీఎంలో 300,నిమ్స్‌లో 200,సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రిలో 200,నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో 200.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3010 పడకలకు యుద్దప్రాతిపదికన ఆక్సిజన్ లైన్స్ వేయనున్నట్లు చెప్పారు. అవసరం ఉన్న చోట వైద్యులు,శానిటరీ,మెడికల్ స్టాఫ్,నర్సులను నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+