జల వివాదం: గవర్నర్‌తో హరీష్ రావు భేటీ
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ తో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ఉదయం భేటీ అయ్యారు. నాగార్జున సాగర్ జలాల విడుదల వివాదంపై తెలంగాణ ప్రభుత్వ వాదనను ఆయన ఈ సందర్భంగా గవర్నర్ నరసింహాన్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

కాగా ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే. చంద్రశేఖరరావు శనివారం ఉదయం 10 గంటలకు గవర్నర్‌తో భేటీ కానున్నారు. కాగా నాగార్జున సాగర్ నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ లేని హక్కుల కోసం ఆశపడుతోందని, తెలంగాణే తమకు అన్యాయం చేస్తోందన్న అపోహ సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications