కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచినా అసెంబ్లీలో అడుగుపెట్టను: జగదీష్ రెడ్డి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 2019 ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుండి ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడ అసెంబ్లీలో అడుగు పెట్టరని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జదీష్ రెడ్డి చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెడితే తాను అసెంబ్లీలో అడుగు పెట్టనని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు పోటీ చేసే దమ్ము, దైర్యం లేని కారణంగానే తమపై బురద చల్లుతున్నారని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదన్నారు. ఈ కారణంగానే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు.

ఓ తెలుగు న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా రాజకీయాలతో పాటు నల్గొండలో ఇటీవల జరిగిన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు గురించి కూడ మంత్రి శ్రీనివాస్ మాట్లాడారు.

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో సంబంధం లేదు

బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యతో సంబంధం లేదు


కాంగ్రెస్ పార్టీ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో టిఆర్ఎస్ కు సంబంధం లేదని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరులోనే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిందన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల ఆధిపత్య పోరులో ఈ తరహ హత్యలు అనేకం జరిగాయని జగదీష్ రెడ్డి చెప్పారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ గతంలో టిఆర్ఎస్ లో ఉన్నాడని, కానీ, శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే పార్టీ నుండి సస్పెండ్ చేశామని జగదీష్ రెడ్డి చెప్పారు. నల్గొండ ఎమ్మెల్యే వెంకట్ రెడ్డి ఈ హత్య విషయంలో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి రారు

నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి రారు

2019 ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎవరూ కూడ అసెంబ్లీలో అడుగుపెట్టరని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేతలు అసెంబ్లీలో అడుగుపెడితే తాను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ నేతలకు పోటీచేసే దమ్ము, ధైర్యం లేదన్నారు.ఈ కారణంగానే తమపై బురద చల్లుతున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు.

కెసిఆర్ కు దూరం చేయాలనుకొంటున్నారు

కెసిఆర్ కు దూరం చేయాలనుకొంటున్నారు


తనను కెసిఆర్‌కు దూరం చేయాలనుకొని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కెసిఆర్ తనను దూరం పెట్టారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. తనను దూరం పెట్టాలని భావిస్తే మంత్రివర్గంలో ఎందుకు కెసిఆర్ తనను తీసుకొంటారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ సంతోషపడుతున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు.

తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులేస్తాం

తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులేస్తాం

తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు వేస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేసులు వేసిన విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో అన్ని విషయాలపై చర్చించనున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana electricity minister Jagadish Reddy said that TRS will win 12 assembly seats from Nalgonda district in 2019 elections.A Telugu channel interviewed him on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి