హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఇంకెన్నిసార్లు ఎంసెట్ రాయాలి', మూడోసారి ఇబ్బందే: కడియం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంసెట్ 2ను రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులు సచివాలయం వద్ద గురువారం ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఎంసెట్ 2 రద్దు చేయవద్దన్నారు. ఇంకెన్నిసార్లు పరీక్షలు రాయాలని నిలదీశారు. కొందరు చేసిన తప్పుకు అందరినీ బలి చేస్తారా అని ప్రశ్నించారు.

మూడోసారి రాస్తే ఇబ్బందే: కడియం

విద్యార్థులు మూడోసారి ఎంసెట్ పరీక్ష అంటే కొంత ఇబ్బందేనని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. పేపర్‌ లీక్‌ నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ వ్యవహారంలో మెరిట్‌ విద్యార్థులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యమా, వైద్య శాఖ నిర్లక్ష్యమా తేలుతుందన్నారు.

ఎంసెట్ లీక్: జేఎన్టీయూ ఉద్యోగుల పాత్ర, వారే ప్రింట్ చేరవేశారా?

గురువారం ఎంసెట్-2 రద్దు చేయొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు వీసీల నియామకం మీద హైకోర్టు తీర్పు ప్రతులు వచ్చిన తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఐడీ నివేదిక ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు.

Minister Kadiyam responds on EAMCET leakage

స్వేచ్ఛగా తిరుగుతున్నారు: ఎన్వీఎస్ఎస్

ఎంసెట 2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అసమర్థతవల్లే ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ అయిందన్నారు. దీనికి సంబంధించిన నిందితులు స్వేచ్ఛ‌గా తిరుగుతున్నార‌న్నారు

ఎంసెట్ 3: 70 మంది తప్పుకు 50 వేల మందికి శిక్షనా?, జేఎన్యూ ప్రొఫెసర్‌పై డౌట్

నిందితులు గ‌తంలోనే ప‌ట్టుబ‌డినా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ అంశంలో తెలంగాణ విద్యాశాఖ నిర్ల‌క్ష్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌న్నారు.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ అంశంపై నోరు విప్పాల‌ని డిమాండ్ చేశారు.

English summary
Minister Kadiyam Srihari responds on EAMCET leakage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X