సీఎం గా రేవంత్ పదవీ కాలంపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ను పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో వీడుతున్నారు. బీజేపీ పట్టు పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇటు రేవంత్ 14 సీట్లలో గెలుపు లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగటం పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఏక్‌నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. మంత్రి హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. పనికి రాని మాటలు, చిట్‌చాట్‌లు బంద్ చేయాలన్నారు.

కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మా పార్టీ అంతర్గత విషయాల్లో మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు. దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్‌ఎస్ అని దుయ్యబటారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్‌రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అనడం తప్పని అన్నారు. 'ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారన్నారు. బండి సంజయ్‌ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications