కన్నీటి పర్యంతమైన కొండా సురేఖ.. కేటీఆర్ కు డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని మీడియా సమావేశాన్ని నిర్వహించి మరీ ఒక మహిళనైన తన పట్ల అసభ్యంగా చాలా ఇబ్బందికరమైన పోస్టులు పెట్టారని, బిజెపి ఎంపీ రఘునందన్ రావు తాను ఉన్న ఫోటోలను పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు.
రఘునందన్ రావు, కొండా సురేఖలపై అసభ్యకర పోస్ట్
బిజెపి ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండ సురేఖ కలిసి ఉన్న పోస్టులను పెట్టి కొంతమంది వీరికి షాదీముబారక్ ఎవరిచ్చారు అంటూ పోస్టులు పెట్టారని, బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త వారిద్దరి ఫోటోను అసభ్యకరరీతిలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఈ పోస్ట్ పైన కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టు చూసిన తర్వాత తాను నిన్నటి నుంచి అన్నం తినలేదని, నిద్ర పోలేకపోయానని ఆమె పేర్కొన్నారు.

వారికి కొండా సురేఖ హెచ్చరిక
ఇటువంటి పోస్ట్ పెట్టిన వారి ఇంట్లో అక్కా, చెల్లి, తల్లి ఉన్నారని, వారింట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఇక సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును చూపించి మీడియా సమావేశం నిర్వహించిన కొండ సురేఖ అసభ్యంగా పోస్టులు పెడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు .
కేటీఆర్ ను టార్గెట్ చేసిన కొండా సురేఖ
అధికారం చేయి జారిపోయిందని వారి ఇష్టానికి ఏది పడితే అది పోస్టులు పెడుతూ అవమానిస్తున్నారని ఆమె విమర్శించారు. మీ ఇళ్లల్లో మీ చెల్లిని, తల్లిని ఇలాగే అంటే ఊరుకుంటారా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఈ ఫోటోను మీ చెల్లికి, తల్లికి చూపించు వాళ్ళు కరెక్ట్ అంటే అప్పుడు మాట్లాడు అంటూ కేటీఆర్ ను సైతం టార్గెట్ చేశారు.
మంత్రి కొండా సురేఖ కంటతడి
— Telugu Galaxy (@Telugu_Galaxy) September 30, 2024
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుతో ఉన్న ఫొటోను అసభ్యకరంగా సోషల్ మీడియాలో పెట్టిన బీఆర్ఎస్ సానుభూతిపరుడు@Lohithy84509764 @RajReddyTweets @RamaGanapa36231 @Yashwanth_INC @AkhilRe98313008 @Rajasekhar_TG #KondaSurekha #Warangal #Telangana #BRS #KTR #Congress… pic.twitter.com/zxJdLgRXev
సురేఖ మెడలో చేనేత నూలు దండ వేసిన రఘునందన్ రావు.. ట్రోలింగ్
ఒక కార్యక్రమంలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఓ చెల్లికి ఇచ్చినట్టు తన మెడలో చేనేత నూలు దండ వేశారని దీనిని తప్పుగా చిత్రీకరించడంతో నిలదీశారు కొండా సురేఖ. ఆ ఫోటోను బీఆర్ఎస్ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారని, తాను సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఇకపై ఇలాంటివి సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు.
కేటీఆర్ క్షమాపణ చెప్పకుంటే ఉరికిస్తాం
మహిళా మంత్రిపైన ఇది ఆటవిక ప్రవర్తన అని విరుచుకుపడిన కొండా సురేఖ, ఈ అసభ్యకరమైన పోస్టు బిఆర్ఎస్ కార్యకర్తలు పెట్టిన నేపథ్యంలో కేటీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలని లేదంటే బట్టలు విప్పించి ఉరికిస్తామని హెచ్చరించారు పదేళ్లు దోచుకున్న బలుపు ఇంకా తగ్గలేదని కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి తనకు జరిగిన అవమానం పట్ల కన్నీటి పర్యంతమయ్యారు.












Click it and Unblock the Notifications