కేసీఆర్ కుటుంబం, మాజీమంత్రి ఎర్రబెల్లిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!!
తెలంగాణ మంత్రి కొండ సురేఖ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న సమయంలో కొండా సురేఖ సీఎం కేసీఆర్ పైన, తెలంగాణ మంత్రులపైన సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకలాపాలను ప్రారంభించిన కొండ సురేఖ ఈ సందర్భంగా మాట్లాడారు.
తన భర్త కొండా మురళి ఫోన్ ను, తన ఫోన్ ను కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ట్యాప్ చేయించాడని సురేఖ ఆరోపించారు. కేసు విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని కొండ సురేఖ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ లో కీలక భూమిక పోషించిన పోలీసులతోపాటు ఎవరిని వదలబోమని కొండా సురేఖ స్పష్టం చేశారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా సురేఖ ఎర్రబెల్లి దయాకర్ రావు పై సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్, కాళేశ్వరం, ఫోన్ టాపింగ్ కేసుల్లో కెసిఆర్ కుటుంబం ఊచలు లెక్క పెట్టక తప్పదని పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర కూడా బయటకు వస్తుందని పేర్కొన్నారు కొండ సురేఖ.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతిలో బిజెపికి వాటా ఉందని మేఘాకృష్ణారెడ్డి బీజేపీకి వందల కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని, అందుకే బిజెపి ఈ వ్యవహారం పై నోరు మెదపడం లేదని కొండా సురేఖ ఆరోపించారు.
కెసిఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన కుమార్తె లిక్కర్ దందా చేసిందని, అవినీతి సొమ్ముతోనే కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని కొండ సురేఖ ఆరోపించారు. పదేళ్ళు తెలంగాణాను దోచుకున్నారని, అనేక స్కాములకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications