హడలెత్తిన ఇసుక మాఫియా: కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణలోని ఇసుక మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలతో ఇసుక మాఫియా బెంబేలెత్తిపోయింది. నిన్నటివరకు హైదరాబాద్‌లోని దుర్భరమైన రోడ్లపై దృష్టిపెట్టిన కేటీఆర్ తాజాగా ఇసుక మాఫియాపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టారు.

ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండా కరీంనగర్ జిల్లా చేరుకున్న మంత్రి, తన కాన్వాయ్‌‌ను కరీంనగర్‌లోనే వదిలేసి పోలీసులు వాహనం ఎక్కారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఇసుక ర్యాంపుల వద్దకు వెళ్లారు.

అయితే అక్కడ హఠాత్తుగా మంత్రి కేటీఆర్ ప్రత్యక్షమవడంతో ఇసుక మాఫియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సందర్భంగా అక్కడున్న వారితో మాట్లాడిన కేటీఆర్ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం అక్కడ కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించారు.

 కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

ప్రస్తుతం కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సోమవారం రాష్ట్ర మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లు, స్పెషల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి వివిధ అంశాలపై చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రతిమా మల్టీఫ్లెక్స్‌లో ప్రారంభం కానుంది.

 కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

ఈ సమావేశంలో సాలీడ్ వెస్ట్ మేనేజ్‌మెం ట్, ఇంటింటా చెత్తసేకరణ, రవాణ, డంపింగ్ యార్డ్సు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, సా ధించిన ప్రగతి, హరితహారం, ప్రస్తుత పరిస్థితి, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు, మంచినీటిసరఫరా, మిషన్‌భగీరథ, రూపాయి కుళాయి కనెక్షన్ ప్రగతి, మంచినీటి సంబంధ సమస్యలు, వర్షాకాల కార్యాచరణ ప్రణాళిక, రెవెన్యూ వసూ ళ్లు, ఎల్‌ఈడీ స్ట్రీట్‌లైట్ల పంపిణీలాంటి అంశాలపై చర్చించనున్నారు.

 కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆస్తి పన్నుల వివరాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏయే ఇంటికి ఎంత పన్ను విధిస్తున్నారో, ఎలా వేశారో తెలుసుకునే వీలు కల్పించింది. www.cdma. telangana.govt.inలో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చిం ది. దీనిపై క్లిక్ చేసి జిల్లా, మున్సిపాలిటీ, ఇంటి నంబర్ నమోదు చేస్తే ఇంటి యజమాని, పన్ను, నిర్మాణ వివరాలు ఉంచారు. ఈ విధానంతో ఏవైనా తప్పులు జరిగితే అప్పటికప్పుడు తెలుసుకునే వీలు ఏర్పడింది.

 కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

కాన్వాయ్ పక్కనపెట్టి పోలీసు వాహనంలో కేటీఆర్ తనిఖీలు

మున్సిపాలిటీల్లో ఇప్పటికే భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు. జూన్ 10 నుంచి వస్తున్న దరఖాస్తులన్నింటిని ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నారు. వీటికి సిటిజన్ చార్ట్‌ను అనుసరించి అనుమతులు అన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangan It minister Minister KTR conducted surprise inspection of Kottapalli Sand Reach.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి