Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుట్టినరోజు వేడుకలకు దూరంగా మంత్రి కేటీఆర్..అభిమానులకు షాకిచ్చిన నిర్ణయం వెనుక కారణమిదే!!

తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు రేపు. అయితే కేటీఆర్ పుట్టినరోజును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని మంత్రులు, టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానులు ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రత్యేక పూజలు చేయాలని, సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని, బట్టలు దానం చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఇలా ఎవరికి తోచినట్టు వారు ప్లాన్ చేసుకున్నారు. అయితే అభిమానులందరికీ షాక్ ఇస్తూ కేటీఆర్ ఈసారి తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న కేటీఆర్


రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే వరదల కారణంగా అనేక గ్రామాలు ముంపుకు గురైన పరిస్థితులలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. అనేక జిల్లాలలో భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తన పుట్టిన రోజు వేడుకలకు బదులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారికి తమకు తోచిన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద సహాయం చేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు

 వరద బాధితులకు సహాయం చేసి ఆదుకోవాలని కేటీఆర్ పిలుపు

వరద బాధితులకు సహాయం చేసి ఆదుకోవాలని కేటీఆర్ పిలుపు


వరద బాధితులకు సహాయం చేసి బాధితులను ఆదుకోవాలని తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మీరు కూడా చేదోడువాదోడుగా నిలవాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక ఇప్పటికే మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు సందర్భంగా, కేటీఆర్ పై చేసిన పాటలు, ఆయనపై రూపొందించిన వీడియోలు, డాక్యుమెంటరీలు రిలీజ్ చేసేందుకు అభిమానులు సన్నాహాలు చేసుకున్నారు. టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, పలువురు కీలక నేతలు కేటీఆర్ ని ఇంప్రెస్ చేసేలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి ఇప్పటికే ప్లాన్ చేశారు.

 కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా చెయ్యటానికి ప్లాన్

కేటీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా చెయ్యటానికి ప్లాన్


ఇక తాజాగా తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ యాదవ్ నేతృత్వంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు సైతం చేశారు. కేటీఆర్ పేరుమీద 116 ఆలయాల్లో అర్చనలు చేయిస్తామని, ద లీడర్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్ పేరుతో కేటీఆర్ జీవితం పై డాక్యుమెంటరీ రూపొందిస్తామని, త్రీడీ గ్రాఫిక్స్ తో స్పెషల్ కేక్ ఆయన పుట్టిన రోజు సందర్భంగా కట్ చేస్తామని సాయికిరణ్ యాదవ్ ప్రకటించారు. కేటీఆర్ పుట్టినరోజు కేక్ లోనూ గత ఎనిమిదేళ్లలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రైజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చూపిస్తామని చెప్పారు.

చివరి నిముషంలో మంత్రి కేటీఆర్ ప్రకటనతో అభిమానుల్లో నిరాశ

చివరి నిముషంలో మంత్రి కేటీఆర్ ప్రకటనతో అభిమానుల్లో నిరాశ


ఈ క్రమంలోనే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అభిమానులను నిరాశకు గురి చేసింది. అయినప్పటికీ కేటీఆర్ వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునివ్వడంతో, రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అభిమానులు వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+