కేసీఆర్ దమ్మున్న నాయకుడు: కేటీఆర్, విమర్శలకు భయపడమన్న తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని వెలుగుగుట్టలో ఇన్‌లెట్-ఔట్‌లెట్ నీటి పంపిణీ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా రూ. 40 వేల కోట్లతో ఇంటింటికీ నల్లా నీరు అందిస్తామన్నారు. ఇంటింటికి నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.

తెలంగాణపై బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే బీహార్ లాగే రాష్ట్రానికి రూ. లక్ష కోట్ల ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ చోరవ తీసుకోవాలని కోరారు. అన్ని రాష్ర్టాలను ప్రధాని మోడీ సమానంగా చూడాలని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి తలసాని మాట్లాడుతూ టీర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కమిట్‌మెంట్‌తో పనిచేస్తొందన్నారు. జంట నగరాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి పథకాలతో ప్రభుత్వం ఓ లక్ష్యంతో ముందుకు వెళ్తోందన్నారు.
తెలంగాణలో ఎక్కైడనా తిరిగే హక్కు ఒక్క టీఆర్ఎస్ మంత్రులకే ఉందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. విపక్షాల విమర్శలకు భయపడమని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications