మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి కేటీఆర్... ఆ కుటుంబానికి ఆర్థిక సాయం...

తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్య రెడ్డి కుటుంబాన్ని ఆయన ఆదుకున్నారు. ఐశ్వర్య తల్లిదండ్రులను ప్రగతి భవన్‌కు పిలిపించి వారికి రూ.2.50లక్షలు అందజేశారు. అంతేకాదు,ఆ కుటుంబం ఉంటున్న షాద్‌నగర్‌లో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ అందించిన సాయానికి ఐశ్వర్య రెడ్డి కుటుంబం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసింది.

ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో చదువుతూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఐశ్వర్య గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. షాద్‌నగర్‌కు చెందిన ఐశ్వర్య ముందు నుంచి చదువుల్లో చురుగ్గా ఉండేది. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆమెకు సీటు లభించడంతో తల్లిదండ్రులు తమ ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2లక్షలు తీసుకొచ్చారు. అలా ఆమెను బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులో చేర్పించారు.

minister ktr financial assistance to shadnagar aishwaryas family

గతేడాది లాక్‌డౌన్ కారణంగా కాలేజీ యాజమాన్యం హాస్టల్ మూసివేయడంతో ఆమె ఇంటికి వచ్చింది. ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు ఆమె వద్ద ల్యాప్ టాప్‌ లేదు. మొబైల్ ఫోన్‌లోనే ఆన్‌లైన్ క్లాసులు వినేది. సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ అయినా కొనివ్వాలని తండ్రి కోరితే కొన్నిరోజులు ఆగమన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు దినసరి కూలీలు... లాక్‌డౌన్ కారణంగా వారి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఓవైపు ఇంటి ఖర్చులు... మరోవైపు కూతురి చదువు కోసం తీసుకున్న లోన్ రీపేమెంట్ వారికి భారంగా మారింది.

ఈ నేపథ్యంలో కుటుంబానికి తాను భారం కావొద్దని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది.తన చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. 'నావల్ల మా ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయి. నేను భారం వాళ్లకి.. నా చదువు భారం.నేను చదువు లేకపోతే బ్రతకలేను.చాలారోజుల నుంచి ఆలోచిస్తున్నా. చావే కరెక్ట్ అనిపించింది.కనీసం ఒక సంవత్సరానికైనా నాకు స్కాలర్‌షిప్ వచ్చేలా చూడండి.అందరూ నన్ను క్షమించండి.' అంటూ సూసైడ్ నోట్ రాసింది. ఆమె ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.చదువుకునే స్తోమత లేకపోవడం వల్ల ఒక విద్యార్థిని ఇలా ఆత్మహత్యకు పాల్పడాల్సి రావడం అత్యంత విషాదకరమనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+