Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ నుంచి ఆయన ఒక్కడే- కేటీఆర్‌కు అరుదైన గుర్తింపు..!!

బెర్న్: ప్రపంచ ఆర్థిక సదస్సు సందడి మొదలైంది. ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. వరల్డ్ ఎకమిక్ ఫోరమ్ ఈ సదస్సును నిర్వహిస్తోంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఈ సదస్సు షెడ్యూల్ ఇదివరకే వెల్లడైంది. ఇది 53వ సమావేశం. దావోస్ లోని స్విస్ స్కీ రిసార్ట్ టౌన్ లో మొత్తంగా అయిదు రోజుల పాటు కొనసాగుతుందీ సమ్మిట్. సుస్థిరాభివృద్ధి సాధించడం, ఆహార సంక్షోభాన్ని నివారించడం, పెట్టుబడులు.. వంటి అంశాలను చర్చిస్తారు.

1,500 మందికి పైగా..

1,500 మందికి పైగా..

ఈ సంవత్సరం దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ భేటీకి ప్రపంచవ్యాప్తంగా 700 మల్టీనేషనల్ కంపెనీకి చెందిన 1,500 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఆర్థికం, సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ.. ఇలా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటోన్నారు.

పారిశ్రామిక దిగ్గజాలు..

పారిశ్రామిక దిగ్గజాలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, టాటా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, కుమార్ మంగళం బిర్లా, ఆదార్ పూనావాలా, సజ్జన్ జిందాల్, నాదిర్ గోద్రెజ్, రాజన్ మిట్టల్, సునీల్ మిట్టల్, సంజీవ్ బజాజ్ వంటి వందమందికి పైగా దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొంటోన్నారు.

దావోస్ లో కేటీఆర్..

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే దావోస్ కు వెళ్లారు. ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా- ఆయన అత్యున్నత స్థాయి సమ్మిట్ లో పాల్గొంటోన్నారు. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను కలుసుకుంటోన్నారు. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వివరిస్తోన్నారు.

అరుదైన గుర్తింపు..

అరుదైన గుర్తింపు..

ఈ ఆర్థిక సదస్సు సందర్భంగా కేటీఆర్ ఓ అరుదైన గుర్తింపును సొంతం చేసుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో పాల్గొన్న 30 మంది టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లల్లో కేటీఆర్ ఒకరు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఆయనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఫాలో అవుతోన్న వారిలో స్వీడన్ కు చెందిన ప్రఖ్యాత పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థెన్‌బెర్గ్, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ వెనెస్సా నకేట్ వంటి ప్రముఖులు ఉన్నారు.

స్థానాలివే..

స్థానాలివే..

కేటీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ KTRTRS, అధికారిక ట్విట్టర్ అకౌంట్ MinisterKTR.. ఈ రెండూ కూడా కే కోర్ ఎనలిటిక్స్ రూపొందించిన జాబితాలో చోటు దక్కించుకున్నాయి. కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ 13, అధికారిక హ్యాండిల్ 25వ స్థానంలో నిలిచాయి. ఈ కేటగిరీలో భారత్ నుంచి మరెవరికీ చోటు దక్కకపోవడం- కేటీఆర్ కు ఉన్న ప్రాధాన్యతను చాటి చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+