హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం ఉద్యోగాలు సాధించాలంటే ఇలా చేయండి: ఉద్యోగార్థులకు కేటీఆర్ కీలక సూచనలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నిరుద్యోగులు తమ ఎదురుచూపులకు తెరపడిందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా త్వరలోనే వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్


ఈ క్రమంలోనే ప్రభుత్వంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఉద్యోగార్థుల కోసం కోచింగ్ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. తాజాగా, సోమవారం పీర్జాదిగూడ మున్సిపాలిటీలో నిరుద్యోగుల కోసం మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 90 వేల ఉద్యోగాలకు సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసిన నాలుగు రోజుల్లోనే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు కేటీఆర్. కోచింగ్ సెంట‌ర్‌లో ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్న ఆయన.. 3 నుంచి 4 నెల‌ల పాటు ఈ కోచింగ్ సెంట‌ర్ కొన‌సాగుతుంది. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు క్లాసులు కొన‌సాగుతాయి. మ‌ధ్యాహ్న భోజ‌నంతో పాటు స్నాక్స్ కూడా ఇవ్వనున్నారని తెలిపారు. ఇదే సమయంలో.. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాల‌ని నిర్వాహ‌కుల‌కు సూచించారు కేటీఆర్.

ఉద్యోగార్థులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

ఉద్యోగార్థులకు మంత్రి కేటీఆర్ కీలక సూచనలు

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కరోనా కంటే ముందు టీ శాట్ ద్వారా విద్య, నిపుణ చానెల్‌ను ప్రారంభించామని గుర్తుచేసిన ఆయన.. యూట్యూబ్‌లో కూడా ఈ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి కంటెంట్ ఈ చానెల్లో ల‌భ్యమ‌వుతుంద‌న్నారు. ఈ చానెల్‌ను వాడుకోవాల‌ని సూచిస్తున్నాను. మీ కోసమే ప్ర‌భుత్వం ఇన్ని ర‌కాల కార్యక్రమాలు తీసుకుంటుంద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆరు నెల‌లు సినిమాల‌కు దూరంగా ఉండాలని సూచించారు మంత్రి కేటీఆర్. అంతేగాక, క్రికెట్ కూడా త‌క్కువ చూడండి.. ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాల‌ను కూడా బంద్ చేయండి.. చ‌దువుపై దృష్టి పెట్టాలన్నారు.

Recommended Video

Telangana Job Notifications : ప్రకటన కాదు ఆచరణ కావాలంటున్న OU విద్యార్థులు | Oneindia Telugu
ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే కాదన్న కేటీఆర్

ఉద్యోగమంటే ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే కాదన్న కేటీఆర్

ఫోన్ త‌క్కువ‌గా వాడితేనే లాభం ఉంటుందన్న మంత్రి కేటీఆర్.. మీ త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టే విధంగా భ‌విష్యత్‌కు ప్రణాళికలు వేసుకోవాలంటూ విలువైన సూచనలు చేశారు. కేంద్రంలో 15,62,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న మంత్రి కేటీఆర్.. కేంద్రం కూడా భర్తీ చేయక తప్పదన్నారు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఒకటే కాదన్న ఆయన.. ప్రభుత్వం ఇవన్నీ మీ కోసమే చేస్తుందన్నారు. పోటీతత్వంతో కష్టపడితే కచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నారు. రాష్ట్రంలో 19 వేలు పరిశ్రమలు వచ్చాయి. స్థానికులకు ఉద్యోగాలు ఇస్తే సంస్థలకు రాయితీలు ఇస్తున్నామన్నారు.

English summary
Minister KTR inaugurates coaching centre in peerzadiguda for job seekers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X